పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

153 వీరత్వము

యాగములందు దానముజేసిరి. పారమార్థికచింతతో కావించిన ధనసంగ్రహ మంత నింద్యము కాదు.

బ్రహ్మక్షత్రియ వీరత్వము

యుద్ధము లేకుంటే పురుషునకు ప్రతిష్ఠ రాదు, విజయుడు కాకున్న వీరునకు వికాస ముండదు - యౌవనమున రిపుషడ్వర్గము ప్రబలియుండునప్పుడు జితేంద్రియులు సంయములు నైన ఆర్యులు తపోబలసాహాయ్యమున దానిని జయించి అభ్యంతరిక వీరత్వమును ప్రతిష్ఠించుచుండిరి. ఈ సమరమున వారిచిత్తమున కేకాగ్రత ఇంద్రియముల కేక నిష్ఠయు చేకూరి విజయమును వారికి కరగత మౌనట్టులొనర్చు చుండెను. తపశ్శక్తిచేత వారికి జయము లభింపగా వారు బ్రహ్మవీరులై దేవత్వము నార్జింపగలిగిరి. అధ్యయనము దమము, ఆర్జవము, ఇంద్రియనిగ్రహము, సత్యమున్నూ బ్రాహ్మణునకు నిత్యధర్మములై యుండెను. అంతర్యజ్ఞానుష్ఠాన మొనర్చుచున్న నారాయణుడు పాశవప్రకృతిసిద్ధములగు అంతశ్శత్రువు లను పశువుల బలియిచ్చినట్లు సామవేదమున చెప్పబడింది. ఈ యంతర్యాగము (సమరము)న జయము లభించుటచేత బ్రహ్మవీర్యము ప్రకటిత మవును. యౌవరాజ్య పట్టాభిషేకమునకు సిద్ధపడుచున్న రామభద్రు డెక్కడ? అతని కరణ్యావాసశిక్ష యెక్కడ? మహైశ్వర్యము, రాజభోగములు - వీటియెడ స్రీరామున కెంతలో నిస్స్పృహ జనించెను, ఎంతలో నారచీరలు గట్టి ఆ యువరాజు అడవికి పోవు