పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

151 వీరత్వము

తేడా లేదు, కాని సాహిత్యమందు వీరికి కలిగెడు గౌరవమున సేవాభేద మున్నది. పాశాత్యవీరులు దేవోపములై ఆయా జాతులకెల్ల తలమానికంబుల (Heroes of the Nations)ని సదా గౌరవింపబడుచుండ అసురుల దర్పము చూర్ణీకృతమై, గర్వము ఖర్వమై, లోభము నివారితమై, తేజస్సు ఉపసంహృతమై, ప్రభుత్వప్రతాపములు నామావశేషము లయ్యెను. శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలగు దేవాంశసంభూతులు వారిమద మణచిరి. షడ్రిపుప్రాబల్యమున మానవులకు సంక్రమించిన ఆసురవీర్యమును నాశముచేయు సామర్థ్యము ఇంద్రియ యనిగ్రహవశమున దేవత్వము సాధించిన వీరులకే కలదు.

వియోగాంతనాటకములయందలి నాయకులూ, పాశ్చాత్యసాహిత్యమందలి వీరులూ, ఆర్యసాహిత్యమందలి అసుర నాయకులున్నూ ఒక్క అచ్చున పోసిన బొమ్మలని చెప్పితిమి కదా. వీరిలో నొకరిచరితము చదివితే చాలు; తక్కినవారి చరిత లామచ్చుగానే ఉండును. ఆర్యకవివరేణ్యు లీగుణముల నెల్ల కేంద్రీకరించి మహాభారతమున దుర్యోధనుని శ్రీమద్రామాయణమున రావణునీ చిత్రించిరి. భోగపరాయణత క్షణక్షణప్రవర్ధమానమై నరుని వశపర్చుకొను ననుటకు లోభవాగురుల జిక్కి దాయలకు సూదిమొన మోపునంత ధరణి నొసంగని దుర్యోధనుడు సాక్షి; ఇంద్రియలాలస పెచ్చు పెరిగి మానవుని నశింపజేయు ననుటకు రావణుడే దృష్టాంతము. ఈరెండుపాత్రముల నతినిపుణతతో నిర్మించి అంతతో నూర