పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149 వీరత్వము

                 కామక్రోధ సమాయుక్తో హింసాద్వేష సమన్విత:
                 మనుష్యత్వా త్పరిభ్రష్ఠ స్తిర్యగ్యోనౌ ప్రసూయతే
                 తిర్యగ్యోన్యా: పృథగ్భావో మనుష్యార్థే విధీయతే.
                                               ........ భారతము.
                 లోనిశత్రువులకు లొంగిన నరుడు
                 మానుషత్వము నేది మను పశువౌచు
                 జంతుజన్మము వీడ జను మానవునకు.

ఇందుకు నహుషుడు ప్రమాణము. వేదాంతము (ఉపనిషత్తు) లందు సూక్ష్మరూపమున సూచింపబడిన ఈ విషయము పురాణములందూ కావ్యములందున్నూ స్థూలరూపమున విశదీకరింపబడింది. స్థూలకల్పన ప్రత్యక్షప్రతీతి చెందుతుంది గనుక తత్సంస్కారము మనస్సులో నిలుస్తుంది. అందుకే రాజర్షియైన నహుషుడు రిపుషట్కమునకు లొంగుట చేత స్వర్గభ్రష్ఠుడై సర్పమై జన్మించెను. శచీదేవి నభిలషించి అధికార మదము తలకెక్క సప్తర్షులచేత పల్లకి మోయించి నందుకు అగస్త్యుని శాపమను ప్రతిఫలము ముట్టింది.

అంతశ్శత్రుప్రాబల్యమూ తన్మూలమున గలిగే అధ:పతనమున్నూ ఓరోపీయ వియోగాంతనాటకములయందున్నూ ఐతిహాసిక వీరులయందున్నూ కనబడును. ఆ నాటకముల యందలి ముఖ్యపాత్రములు అరిషడ్వర్గపాటవమునకు లొంగి ఉన్మాదులై నరరూపరాక్షసు లనదగి ఎట్టి దుష్కార్యముల నాచరించిరో ఒకటో ప్రకరణమందు వివరించినాము. ఆ ఖండమున ఆ నాటకముల ప్రభ హెచ్చి ఆ పాత్రములకు గౌరవ