పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

123 మానవప్రేమ

ఇసబెలా తనసతీత్వము పవిత్రతయు నిల్పుకొని ఆత్మసంయమ మాచరించెను. ధర్మానురాగపూరితయు పరమపూతచరితయు నగునామె ఏంజిలోను తిరస్కరించుట ఒక వింతయా ? ధర్మపరాయణ యగు నామెముందర పాపా కులచిత్తుడగు ఏంజిలో నిల్వగలడా ?*[1] ఇట్టియాదర్శము లిక కొన్ని షేక్స్‌పియరు నాటకముల యందుండిన కవి గౌరవ మధికతరమై యుండును.

కీచకునిప్రలోభనమున ద్రౌపది యిట్టి ఆత్మసంయమ మగుపరిచెను. ఈవిషయమున నీ సతీమణులిద్దరూ సమానముగా తులతూగుదురు.

పురుషుల సంయమము.

భరతునిసంయమము చూడండి. అయోధ్యాసింహాసన మాతని ప్రతీక్షించుచుండెను; తన్మార్గమును చక్కజేసి కైక

  1. * But virtue, as it never will be moved Though lewdness court it in a shape of heaven, So lust, though to a radiant angel linked Will sate itself in a celestial bed And prey on garbage. అలమి పోకిరితనము స్వర్గాకృతిగొని కోరిన చలింపబడదు సుగుణ మొకప్డు దివ్యమూర్తిని గలిసియున్ దృప్తిపడక గుహ్యచాపల్య మెంగిలికూళ్లుగుడుచు. ఆ|| నా|| దా|| Hamlet Act I