పుట:SaakshiPartIII.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. ఉన్మత్తుని ప్రలాపము

ద్రాసులో తిరువల్లిక్కేణి సముద్రతీరానికి షికారు వెళ్లాడు జంఘాలశాస్త్రి. అక్కడ రకరకాల మనుషుల్ని చూశాడు. అద్భుతమైన సముద్ర సౌందర్యాన్ని సాయం సంధ్యా సౌందర్యాన్ని చూసి పరవశించకుండా, నానా సంసార విషయాలతో సతమతమయ్యేవాళ్ల ధోరణిని ఏవగించు కున్నాడు. కంటికి తనివి తీరనంతగా చూడదగింది ఆకాశం. అలాగే చూడదగిన రెండోది సముద్రం.

సముద్రపు హోరునే శ్రుతిగా చేసుకుని పాడుకుంటూ ఉత్తరం దిక్కుగా నడిచాడు శాస్త్రి. అక్కడ బాడిదె కర్ర తెప్ప మీద ఒక్కడూ కూర్చున్నాడొక పిచ్చివాడు. దేశభక్తుడో దైవభక్తుడో అనుకుని దగ్గరకు వెళ్లాడు.

ఆ పిచ్చివాడు ఉద్యమాల్ని, ఉపన్యాసాలిచ్చేవాళ్లనీ తెగ తిడుతూ జంఘాలశాస్త్రితో మాట్లాడాడు. దేశభక్తి జాతీయ ఐక్యం గురించి ఉపన్యాసాలు ఎవరూ ఇవ్వరాదని నిషేధిస్తున్నాడు. ఇప్పటి జాతి భేదాలకు, కులభేదాలకు, మనుషుల మధ్య పరస్పరం కుమ్మలాటలకు కారణం ఈదిక్కుమాలిన ఉపన్యాసాలే అన్నాడు. ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్లంతా స్వలాభం కోసం పాకులాడే శుంఠలే నన్నాడు. ఈ ఉపన్యాసాల వ్యాధి ప్రబలడానికి ముందు దేశంలో జాతులు, కులాలు నిజంగా సఖ్యంగానే వున్నాయన్నాడు. అప్రయత్నంగానే బాగావున్న స్థితిని ప్రయత్న పూర్వకంగా తగలబెట్టారన్నాడు. మీ ఉపన్యాసాలే సందేహాలకీ, అవిశ్వాసాలకీ కారణమన్నాడు. రాట్నపు ధ్వని తప్ప, నోటితో మాటలాడరాదని నిషేధించాడు. ఆచరించని మనుషులున్నంత కాలం జాతి కర్మ మింతే అన్నాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

మదరాసులో సముద్రతీరమున నీనడుమ నొక సాయంకాలమునం దిరుగుచుంటిని, పవనభక్షిణమునకై కొందఱు, పడుచు విలాసినులఁ జూచుటకై కొందఱు, పనిలేక కొందఱు నటుకువచ్చి క్రిందిచూపులతో నిట్టులట్టు లల్లోడుచు, నిట్టె కలియుచు, నుట్టే వేఱగుచు, వంక దండములతో, మాయాకరచాలనములతో, దొంగనవ్వులతో, వింత యిగిలింపులతో