Jump to content

పుట:SaakshiPartIII.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరమునకు నాల్గుమాసములు పాడిన కోయిలపాట నిరక్షరము కాదా? అదిగాక రాగాలాపన నిరక్షరము కాదా? రాగమువలన కలిగినయానందమున కీర్తనవలనఁ గలుగునా? గాయకులలోఁ బదుగుఱ నేయొక్కఁడో గాత్రజ్ఞఁడున్నాడు. కాని మిగిలినవారందఱు యంత్రజ్ఞలే కాదా? గానకళ యత్యంతస్వతంత్రమైన కళ. దానికి మనవా రకరములు సాయమిచ్చి సార్డముగ, విశాలముగ జేసినారు. మొదటఁబుట్టిన సారస్వతమంతయు గానమే. అప్పటివలకింక యూరుపేరు లేదు. మృదువులైన యక్షరములు, నభిప్రాయములు. గానధ్వనులలోఁ జేరుచున్నవి కాని వానికిఁ గవిత్వమని పేరులేదు. ఏదైన రవంత పేరున్నను నది గానమునకు సహాయకళగా నున్నదిగాని స్వతంత్రకళగా లేనేలేదు.

గానమున్నంతసేపు, భక్తియున్నంతసేపు కవితాకళకుస్వాతంత్ర్యమేర్పడదని వారి తరువాతవార లెంచి గానమనుండి దానిని తప్పించి, భక్తిని దీసిపారవైచి పరమాత్మభక్తికి వ్యతిరేకమైన ప్రాపంచకభభక్త్యాదులను రసనులుగా నేర్పఱచుకొని యైహికవిషయములందు మాత్రమే కవిత్వమును జెప్పి దానికి గళాస్వాతంత్ర్య మిచ్చుట కెన్నిపాటులైనఁ బడినారు. అంతటినుండి వేదగానము వదలి దానికి కవిత్వముబయలుదేరినది. రామాయణమును వ్రాసి వాల్మీకి దానిని రాముని యెదుట బాడించెనఁట. వాల్మీకి యెంతగడుసువాండో గానకళ మొదటికళ యని, కవిత్వము దానికి సహాయకళయని యంగీకరించుటకు వాల్మీకి యెంత మాత్రము నిష్టపడక గానమకంటె గవిత్వమే ముందని వెల్లడిజేయుట కిట్టు కవిత్వము చెప్పి పాడించినానని చెప్పినాడు. తెలిసినదా? కవిత్వము చెప్పి గానముచేయించుట కల్ల, పాడి పాడించెననుట పరమార్ధము.

తరువాత నన్నిరసములందు నన్ని రసహినవిషయములందుఁగూడ గవిత్వము విచ్చలవిడిగ బయలుదేరినది. కవిత్వముననే నిఘంటువులు, వైద్యశాస్త్రము, జ్యొతిషశా స్త్రము, పాకశాస్త్రము, సాముద్రికశాస్త్రము, నశ్వాది సమస్తశాస్త్రములు గూడఁ జెలరేగి బయలుదేరినవి. చిట్టచివరకు చరిత్రలు కథలు కూడ కవిత్వముననే బయలుదేరినవి. పంచాంగం మాత్రము పద్యములతో బయలుదేరలేదు. ఇట్టి దుస్థితిని బరిశీలించి భవబంధమో కణసాధనమగు గానమునకుఁ దిరుగ బ్రాధాన్య మిచ్చి పూర్వపవిత్రస్థితిని నిలువఁబెట్టఁ దలఁచి త్యాగరాజు, క్షేత్రయ్య, భక్తిరసమున భవతారకగాన మొనర్చిరి. అందువలన దుస్ల్పితి రవంత యడ్డినదేగాని యాగలేదు. గానమునకుఁ బతనము భ్రష్టమార్గమునఁ గవిత్వమునకు బుష్టి వృద్దియగుచునే యుండెను. "చేతులెత్తి మ్రొక్కుచుంటిరా నాతండ్రి" యను భక్తికీర్తనకుఁ బాఠాంతరముగ 'చెఱఁగు మాసియున్నదా నరా నాసామి" యని యవకతవక శృంగారరసకీర్తన బయలుదేరిన గానమునకు మొదట సహాయ కళగానున్న కవిత్వ మిట్టను చితమార్గముల నస్వభావముగ విజృంభించి యిప్పడు గానముల కంటె బలవత్తరముగ గానబడుచున్నది. కాని ఈబలము కృత్రిమము. గానకళయే ప్రథమమయినది. దానికి రవంతతోడుగనే కవిత్వముండదగినది. గానము వట్టిధ్వని కదా? అక్షరసాహాయ్యము లేనిదే అది యెట్లు శాశ్వతముగా నిల్చునవి నన్నధిక్షేపింతురా? ధూ! కళయగునా కాదా యనునదే పరిశీలనాంశము. కాని స్థిరమా యస్థిరమా యనునది కాదే. సృష్టిలో స్థిరమైన దొకటియు న్నదా? ఒకగానమునకే ప్రత్యేకకళాత్వము కాని కవిత్వమునకు గాదు, కవిత్వమే కళకానప్ప డింక జిత్రలేఖనమా? అది మఱింత కృత్రిమమైనది. కళ గానకళ యొక్కటియే. ప్రత్యేకముగాఁ బరమాత్మతో సంబంధించిన కళ. -