పుట:SaakshiPartIII.djvu/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాతండు నన్నడిగెను. సానివీథిని సరసుడు లేడన్న మాట లేకుండజేసి సరే సరే ఇంక జెప్పనక్కఱలేదు. ఈ నడుమను దురకపేటలో మంగలివానిమేడలో జరిగిన యఖిలాంధ్రక ళావతి పరిషత్తులో మాషడ్డకుఁ డధ్యక్షుడై యేమని యుపన్యసించె ననఁగా:-

ప్రపంచమున నున్న దొక్కటే రసము. అది శృంగారరసము. భవభూతి యది కరుణ రస మనుగాక! ధూ!

“భవభూతి సాహితీప్రజ్ఞాప్రభాయుక్తుండా మాటమాయొద్దననఁగరాదు"

అందుచేత స్వయంప్రకాశులైన మన పరిషత్తులో సారస్వతపండితునకుఁ దావులేదు. ఆతని నావలి కీడ్చివేయవలసినదే. మన సిద్దాంత ప్రకారమున్న దొక్క శృంగారరసమే. ఆరసమే పరిస్థితి విభేదములఁ బట్టి వీరరసమగుచున్నది. అన్నియు యథావిధిగా జరుగుచు న్నంతసేపు శృంగార రసము నిప్ర్చమాదముగ బ్రవహించుచుండును. మన ముంచుకొన్న సానివారి చక్కని చుక్కయొద్ద నెవఁడైన పైసరసుఁడు మనకంటఁబడినాఁడనఁగ శృంగారరస మునకుఁ దొట్రుపాటు. పరిణామావస్థ కలిగినదా లేదా? మనము గొడుగుకామతోను వాడు పై జారుతోను దారసిల్లినప్ప డరగంట క్రిందటి శృంగారరసమే వీరరసమైనదా లేదా? అంతేకాని ఇంతలో స్వర్గమునుండి వీరరసము దిగినదా? తప్ప. మనము వాడు కొంతసేపు గుంజులాడిన పిదప వాడు మన క్రిందఁ బడఁద్రౌక్కగ మన మలో యని యేడ్చితిమా లేదా? నిముసము క్రిందట వీరరసముగా మారిన శృంగార రసమే యిప్పడు కరుణరనముగా మారినదా లేదా? మeటికొంతసేపైన తరువాత సానివారి మణిపూస మనయోుద్దకు దీండ్రించు చువచ్చి నాయింటి కెవ్వడైన పెద్దమనుష్యుడు బందుమర్యాదచే వచ్చినప్పడు నీవింతయల్లరి చేయుదువా? పో యని మనపైఁ గోపపడఁగ దాని దయకొఱకు “అకించనో నన్యగతిశ్శరణ్య స్త్వత్పాదమూలం శరణం ప్రపద్యే' యని బట్టమెడ జట్టుకొని మనము దానికాళులపై బడినప్పడు వెనుకటి శృంగార రసమే యిప్పడు దివ్యమైన భక్తిరసముగా మారలేదా? అందుచేనున్న దొక్క శృంగారరసమే శాస్త్రీజీ ఈ గొడవ యంతయు నే నెందులకుఁ జెప్పితినో జ్ఞప్తియున్నదా? నే నెట్టుపన్యాస మారంభించితినో చెప్పఁ గలవా?" యని యాతడు న న్నడిగినాడు.

ప్రపంచములో నేకత్వమే కాని ద్వివిధత్వము లేదని యుపపాదించి నావు. దానిని స్థిరపఱచుకొనుటకు మీషడ్డకుని శృంగార రసైక్య ప్రవచనమును చేసినావు. అని నే నతనికి జ్ఞప్తిచేసితిని. -

సరి సరి. ఇంక దారిలోఁ బడినాను. తొందరలేదు. మాషడ్డకుని శృంగారరసవిషయకో పన్యాసమున కలరి యాతనిని మా బంధువులలో బ్రహ్మ రథము పట్టినారు. నేను నట్టి యైక్యమునే మeజీయొక సన్నివేశమున స్థాపింప దలచినాను.

నీకు నీతండ్రికి వస్తుతత్త్వమున నేమైన భేదమున్నదా? లేదు. లేనప్పడు నీతండ్రికి నీవు మ్రొక్కవలసినదని జనులేల యనుచున్నారు? నీకుఁ గారకుడగుటచేతనే కాదా? అట్టిచో నీవంటి మనుష్యులను నితర జీవములను, ననంతగోళములను సృష్టించిన భగవంతు నెడల నీవు చేతులు జోడించి మ్రొక్కి భక్తిగనుపఱుపవలసినదేనా? అట్టుచేయుచున్నావా? సోదర సోదరీమణుల ద్యజించుచున్నామే. గురువులను ధిక్కరించు చున్నామే. తల్లిదండ్రు