Jump to content

పుట:SaakshiPartIII.djvu/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోతటస్టించినప్పడు బ్రహ్మగారు పార్వతికొంగు బట్టుకొన్నాడు. మహాదేవయ్యా గారు మహాలక్ష్మమ్మబుజముపైఁ జేయివైచినా"డని చెప్పినాడు. మహాత్మునిఁ గూర్చి మనయందఱ యజ్ఞాన మానటకుల యజ్ఞానముకంటె తక్కువది కాదు. నిశ్చయముగా మహాత్ముని తత్వము దుధ్రహమైనది. అది తెలిసికొనిన యాతండు ప్రపంచమును దెలిసిన యాతండే.

(Aesop) ఈసప్ అనునాతండు మిట్టమధ్యాహ్నమునందు చేతిలో లాందరును పట్టుకొని వీథులలోఁ దిరుగుచుండెను. ప్రభువువలెఁ బగటిదివిటీతో బయలుదేరితివేమని యెవ్వరో యడుగగా మనుష్యు డెవ్వడైన, నిజమైన మనుష్యునకొఆ కంత కష్టపడి వెదుకఁదగినదే. అతని ప్రయత్నమెంతయైనఁ గొనియాడఁదగును. ఆతని శ్రమకు మన మెన్నియైన ధన్యవాదము లీయవలసినదే. కాని యాతండు వెదకుచున్న స్థలమున్నదే యదియంత తగినది కాదేమో యని మాత్రమే సందేహము. పశ్చిమదిశను వదలి తూర్పుగా వచ్చినయెడల నాతని ప్రయత్నమనేకపర్యాయములు గృతార్ధమైయుండెడిది. అట్టి ఈసఫ్ మాత్రమే కాదు. ఈ సృష్టియంతయు సంతోషింపఁదగినది. నిజమైన మనుజుఁడు తిరుగ భారతభూమియం దుద్బవించినాఁడు. ఊరక సంతోషించి యూరకొనకుడు. ఆయననుబటింపుడు.The proper study of mankind is man శ్రద్ధగా బటింపుడు. వెనకటి మహాత్ములను మన మెఱుఁగము. ఇప్పటి మహాత్ముని కాలమున జీవించియుండుటచే పుణ్యాత్ములము. ఆయన మనస్తత్త్వమును జదివి జన్మమును సార్డపఱచుకొనుఁడు. ఒక్క సారి మనము భగవంతుని యను భవమును సంపాదించుకొనలేము. అది నునకసాధ్యము. మనకు భగవంతునికి నడుమ మహాత్ముడు మజలీగ నిల్చియున్నాఁడు. ఆయనను మనము శ్రమపడి తెలిసికొందము. ఆయనతత్త్వము నెఱిఁగినవెనుక నీశ్వరతత్త్వమును గ్రహించుట విశేషకష్టము కాదు. ద్వైతమతస్థులందఱు ముఖ్య ప్రాణమూర్తిమాధ్యస్ట్యమునఁ దరింతుమని యనుకొనుచున్నారు. మహమ్మదీయు లందులకు మహమ్మదుగారిని నమ్మియున్నారు. క్రైస్తవమతస్థులందఱు జీసస్సును నమ్మియున్నారు. విశిష్టాద్వైతులు కూడ పురుషకారమును పూర్తిగ నమ్మినవారే. అటులే యిప్పడు మహాత్ముఁ డామాధ్యస్ట్య కృత్యమును నిర్వహించు టకు భగవంతునిచే నాజ్ఞాపింపఁబడినట్టు తెలిసికొనవలసియున్నది.

“నాయనలారా! చదువులన్నియుఁ గట్టిపెట్టుఁడు. వానివలన నేమియు లాభము లేదు. చదువఁ దగినపుస్తక మున్నది. అదియే చదువుఁడు. ఆపుస్తకము పర్థకుటియందు భద్రముగనున్నది. దానిలోని యక్షరములు నక్షత్రములవలె నేదేశమునుండి చూచినను కనఁబడును. నాయనలారా! అదే చదువుఁడు. దైవప్రార్ధన మొనర్త మందఱములెండు' అని నే నుపన్యసించుచుండఁగా నొక్క క్రైస్తవమతగురుఁడు లేచి యిట్టు పలికెను! “నే నిప్పడు లేచినది మీదైవ ప్రార్థనకొఱకు కాదు. గాందిగా రొనర్చిన యుపవాసమును గూర్చి నేను గొన్నిమాటలు చెప్పవలసియున్నది. ఏసుక్రీస్తువారు దేవునికొడుకు ఆయన చెప్పినమాటలు దేవుడు చెప్పినమాటలే. బైబిల్ మాకు వేదసత్యము. ఏసుక్రీస్తు ఉపవాసముచేసినాఁడని యనేకుల యభిప్రాయమైయున్నది. ఆయన యట్లెన్నఁడు జేయలేదు. నలువదిదినములు రేయుంబవళ్లు భోజనము లేకుండ మాత్రముండినాఁడు. ఎందుచేత ననంగా పాపాత్ముల నెట్టు పరిశుద్దులను చేయుదునా యను మహాచింతచే భోజనమొనర్చుట కాయనకుఁ దీరికయే లేకపోయినది. అంతేకాని పాపప్రాయశ్చిత్తముగాగాని భగవంతునియనుగ్రహముకొ