ఉవెన పడడం = బెదిరిపోవడం
ఉవెన పడడం = ఉలిక్కి పడడం
ఉవ్వె మాటలు = ఉత్తిత్తి మాటలు
ఉవ్వె మాటలు = అబద్ధపు మాటలు
ఉసకు = మేకలను మేపడం
ఉసిపోనీకపోవడం = విరామం ఇవ్వకపోవడం
ఉసిరేణికాయ = ఉసిరికాయ
ఉసురు = పాపం
ఉసురుదీసి = ఒత్తిడి తెచ్చి
ఉసుర్లు = ఉసుళ్లు(పురుగులు)
ఉసులు = అనుకూలం
ఉసులు = సౌఖ్యము
ఉసెండ్లు = కొయ్యవంకెలు
ఊగాలు = గాలిపటాలు
ఊదర = పనికిరాని
ఊదుకడ్డీలు = అగరు వత్తులు, బత్తీలు
ఊనప్పా = నిజమే సుమా
ఊమిక = బూర(వాద్యం)
ఊరిమిండి = పచ్చడి
ఊర్కేనే = అనవసరంగా
ఊసిపోవడం = ఊడిపోవడం
ఊసెండ్లు = జొన్నదంట్లు
ఊసోడు = బక్కపలచని వ్యక్తి
ఎంక = ఎముక
ఎంక లేని చెయ్యి = దానధర్మాలు చేసే వ్యక్తి
ఎంక లేని నాలిక = తేలిగ్గా అబద్ధాలు చెప్పడం
ఎంకెలితం చేసుకోవడం = తన పరిచయం చెప్పుకోవడం
ఎంచేపూ = ఎంతసేపూ
ఎంటంబడే = వెంటనే
ఎంటంబడే = తక్షణమే
ఎంటిక = వెండ్రుక
ఎకజాస్తిదనం = సహించలేక పోవడం
ఎకిలిక = పైత్యం
ఎకుర్లు = పసుపుకొమ్ములు
ఎక్కోపపడడం = కోపగించుకోవడం
ఎక్కోపపడడం = అలగడం
ఎగజూపెట్టుకోవడం = ఆశగా చూడడం
ఎగసుల్లి = ఎగతాళి
ఎగస్పార్టీ = ప్రత్యర్ధులు
ఎచ్చిల్ల పడడం = ఏమరిపాటు
ఎచ్చిల్ల పడడం = అజాగ్రత్త
ఎచ్చులు = గొప్పలు
ఎచ్చులు = డంబాలు
ఎజ్జిక = ఇతవైనది
ఎజ్జిక = ప్రీతికరమైనది
ఎటుకర్లు = నిచ్చెన అడ్డకొయ్యలు
ఎట్టుగొట్టడం = అచ్చుకొట్టడం
ఎట్లనోకట్ల = ఏదో ఒకవిధంగా
ఎట్లిస్తావు = ఎంతకిస్తావు
ఎడంగా = దూరంగా, పక్కగా
ఎడపిల్లోడు = కాస్త పెద్ద పిల్లవాడు
ఎడ్లోమకార్తె = పైరుమధ్యలో వచ్చే కార్తె
ఎత్తటం = కొనడం
ఎత్తుకొనిపో = తీసుకొనిపో
ఎత్తెయ్యడం = తీసెయ్యడం
ఎత్తెయ్యడం = శుభ్రం చేయటం
ఎదారి = దిగులు
ఎదురుకోలు = ఆడపెండ్లివారి ఆహ్వానం
ఎదురుగుటికెలు = చీముపట్టిన గొంతు బిళ్లలు
ఎదుర్మల్ల = ఎదురెదురుగా
ఎదుర్మల్ల = ముఖాముఖి
ఎదుర్రొమ్ము = ఛాతీ
ఎనకసార్కి = గతంలో ఒకసారి
ఎనబడడం = రజస్వల సూచనలు
ఎనుములు = గేదెలు, బర్రెలు
ఎన్ని బడితే అన్ని = అవసరానికి మించి
ఎప్పువెయ్యడం = పాలలో తోడు వేయడం
ఎరినాలయేల = చద్ది తినేవేళ
ఎరువు సరుకు = అప్పుగా తెచ్చుకున్న వస్తువు
ఎర్రగడ్డలు = ఉల్లిగడ్డలు, నీరుల్లి
ఎలకల్లు = నేరేడు వనం
ఎలగాడి = ఇంటిబయట పశువుల గాడి
ఎలజె కాయలు = గజనిమ్మకాయలు
ఎలప సెమ్మిక = పాతర మూత రాయి
ఎలసక్కెడ = చిక్కెం
ఎలిపొక్కానాకు = గచ్చ ఆకు
ఎల్లకు = అంతా
ఎల్లకేయడం = చేటతో నేమడం
ఎల్లకోలు = తప్పెటను తగిలించుకునే తోలుపట్టి
ఎల్లబారు = బయలుదేరు
ఎల్లవ = వరద
ఎల్లాకొల్లిగా = సమృద్ధిగా
ఎల్లుకో = ఎదిరించు
ఎల్లెపంది = తిరగబడి కరిచే పంది
ఎసగర్ర = ఊనిన చర్మము
ఎసల్ల పొద్దు = అన్నం వండే వేళ
ఎసిలి పోవు = చచ్చిపోవు
ఎసిల్లపడడం = బాధపడడం
ఏంటికి = ఎందుకు
ఏంది = ఏమిటి
ఏకలు = ఎలుక కాళ్లు
ఏకోన = తెల్లవారు జామున
పుట:Renati palukuballu.pdf/5
Appearance
ఈ పుటను అచ్చుదిద్దలేదు