Jump to content

పుట:Rani-Samyuktha.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

కానిండు మీ కేమిచేయవలయునో తెలుపుడని సంయుక్త యాజ్ఞాపించినట్ల సమస్త కృత్యముల నెరవేర్చు చుండిరి. సంయుక్త యుత్కంఠంతో నా రాత్రి సహాయపడిన మహాత్ముని పేరు తెలియకపోయెనని విచారమున రెండురాత్రులు గడపెను. అంత మూడవనాడు కంచుకి యొకండరుదెంచి "అమ్మా ! మీరు రేపు మీ నగరమున కేగవలయుఁ గాన ప్రయాణమున కాయత్తమై యుండు" డన "మీరాజువా రెక్కడ ? ఆయనను సందర్శింపక మే మెట్లు పోవఁగల" మని మంజరీ సంయుక్తలు పల్కిరి. అందులకు గంచుకి "అమ్మా! మా రాజుగారు వేరొండవసరమగు బనిమీద బోవలసి మమ్మందఱ నిక్కడ నియోగించి రెండుమూడు దినములు గడచిన వెనుక మిమ్ము కన్యాకుబ్జమునఁ జేర్ప నాజ్ఞాపించి వారప్పుడే వెడలినారు." ఇక మాకు వారి దర్శనమగుట దుర్లభము. కావున బ్రయాణమగుడని తెలుప నిరుత్సాహులై మమ్ము విపత్తునుండి రక్షించిన మహానుభావుని గాంచు భాగ్యము లేకపోయెనే యని చింతించుచు బ్రయాణమున కటులేయని సమ్మతించిరి. అంత మరునాడు ప్రయాణము నిశ్చయించినందున కొన్ని దినములవరకు సరిపోపు నాహార సామగ్రుల బండ్లపై నెక్కించి రాణివాసపు దాసీలకు గాను మఱికొన్ని బండ్లు సన్నాహపఱచి నౌకరులు సమస్తము సిద్ధముచేసి యుంచిరి. ఆ మరునాఁ డందఱు భోజనముచేసి సాయంతనము మూడు గంటలకు బయలుదేరుద మనుకొనిరి. ఈ లోపల మంజరీ సంయుక్త లుచితవేషములూని ప్రయాణము

81