Jump to content

పుట:Rani-Samyuktha.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము


అంతఁ దెల్లవారుజామున నాలుగు గంట లగుటయు నిదురఁ జెందియున్న సింగములు లేచి మందబుద్ధులగునో ద్వారపాలకులారా! జయచంద్రునకు బ్రాణసమానురాలగు సంయుక్తను దస్కరు లెత్తుకొని పోవుచుండ నజాగ్రతతో నిదురించు చుంటిరి గాన మిమ్మందఱ నిప్పుడే మ్రింగివై చెదము చూడుండని హుంకారములు సలుపుచున్న వోయన నొక్క పెట్టున భయంకరముగ గర్జింపసాగెను. అత్తరి నాగర్జనముల కుల్కిపడి లేచి మంజరి తన కట్టెదుట సంయుక్తను గానక సంభ్రమముంది పేరులుపెట్టి పిలచియు బ్రత్యుత్తరము గానకొకవేళ తననిద్రాభంగము సేయుట కిచ్చగింపక వేరొక చోటికేగినదేమో యని మృగశాల లన్నింట వెతకి యెచటనుం గానక దిగులొందుచు ద్వరితగతి నారామము బ్రవేశించి నల్గడలఁ బరికించి యెందును

58