పుట:Rani-Samyuktha.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము


యేల పొడమును? పూజనీయంబగునో యార్యావర్తమతల్లీ ! నీ కైనను వీరలపైఁ గిన్కజనింపదా ? సాధువులగుఁ బశువులు నీ యెడగావించిన యపకారమింతైన గలదా ? ఒక్క పర్యాయముగ నీ దుష్టు లందఱని నేలమ్రింగివేయవు?" అని యింతసేపు విచారించి యప్పటికట్లేయని సిపాయిలతో నొప్పుకొనెను. అంత రాత్రి విస్తారము ప్రొద్దుపోవుట వలన శయనింపఁదలచి వారలు వృక్షముక్రింద మైనపుగడ్డలఁ బఱపించి వానిపై బ్రక్కల వేయించి కాపరిని నడుమఁ బరుఁడబెట్టుకొని తాముచుట్టు బరుండి నిదురపోయిరి.

17