పుట:Rani-Samyuktha.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియవ ప్రకరణము


వ్యూహముబన్ని జాగరూకుడై తాను నడిమిభాగమున నుండెను. ఇక్కడివార్త నంతయు నిగూఢముగ కొందఱు చక్రవర్తి వేగులవారువచ్చి తెలిసికొనిపోయి తమ వారల కెఱుక పఱచిరి. చక్రవర్తి సైన్యము నూరువేల గజములను, నూట యిరువది వేల గుఱ్ఱములను నూటడెబ్బదివేల భటులను గూడియుండెను. యమునా ద్వీపకల్పరణమున గుతుబుద్దీను నోడించి ఢిల్లీయం దనేక బిరుదులఁగాంచి ప్రఖ్యాతి వహించిన యాతతాయియను యుప సకలక్షౌహిణీనాయకుఁ డిసార్వభౌమ సేననంతయు నతి ప్రావీణ్య మొప్ప నడిపించుకొని వచ్చుచుండెను. జయచంద్రు సేనయందువలెనే చక్రవర్తి సైన్యమునందును నూర్గురు భటుల కధికారులగు నాయకులుగలరు. వీరియనంతరమును నుద్యోగులు గలరు. అందు గడపటి యుద్యోగి వశమున నిరువదిమంది భటులుమాత్రమే యుందురు. వీరందఱు గ్రమమగు రణశిక్ష నలవర్చుకొని యుండిరి. ఆతతాయి ప్రచండునివార్త విన్నవెంటనే తన సైన్యమునఁ గొంతభాగము ప్రకంపనుడను సేనాని కిచ్చి శత్రువుల కెఱుక రాకుండ దూరమునుండి చని వరాహ వ్యూహమున బడమటిదిశను దాకఁబంపెను. సూకరముల వలె జిందర వందరగ బరువెత్తుచు శత్రువుల సమీపించిన వెంటనే

యొక్క పర్యాయముగ నందఱు గుమికూడుటే వరాహ వ్యూహము. తరువాత గంకటు డను వానివశమున మఱికొంత సేనను సూచీవ్యూహమున నుత్తరము ముట్టడింప నంపెను. ఆది యందు సన్నముగనుండి వెనుకకు బోనుపోను విశాలమగు

141