పుట:RangastalaSastramu.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పతాకాస్థాపకము

మూడవ పతాకాస్థాపకము." 1

ఉదా|| వేణీసంహారం ద్వితీయాంకంలో కంచుకి "దేవా ! భగ్నమయి నది" అన్నాడు. ఏమిటో తెలియలేదు.

దుర్యో--ఎవరిచే

కంచుకి--స్వామీ భీమునిచే !

ఏమిటో తేలలేదు. చివరకు కంచుకి "భగ్నమైనది మీరధకేతనంబు" అనడంలో అస్ఫుటంగా ఉన్న అర్ధము ప్రస్పుటమైనది.

నాలుగవ్ పతాకస్థానకము: "ఇంకొక అర్ధమును సాదించునట్లు సుశ్లిష్టముగా కావ్యమునందువయుక్తమైన రెండర్ధములుగల వాక్యము నాలుగవ పతాకా స్థానకము".2

"పాండువును సోత్కలిక దీని బ్రాన్తజృంభ
నవిరళశ్వసనోద్గమాయాసితాత్మ
గంతుయుత లాతి నకి బోలె గనుచు లతను
బొనరిచెద దేవిముఖమున గినుకకేంపు" 3

అనిరత్నావళిలో రాజుపఠించేపద్యము ఉద్యానలతకు, వాసవదత్తకు అంవయించడమేగాక సాగరికకుకూడా అవ్యయించడాం ఇందుకుదాహరణ.

ఇందులో దోహదము మూలంగా రాజు తన నవమాలికను చూసి సంతోషిస్తుంటే వాసవదత్తకు కొపము రావడం సహజము. వేరొక్ స్త్రీ రాజును వలచినప్పుడు, ఆస్త్రీని రాజు చూసినప్పుడు వాసవదత్తకు కలిగే కొపంతొ ఈ కొపాన్ని పోల్చడమైనది. ఈ నాయిక చర్య సాగరికను రాజు చూసినప్పుడు వాసవదత్తకు కలుగబోయే కోపాన్ని సూచిస్తుంది. నాలుగవ పతాకస్థాపకము బావిని సూచించేది.

--

1.--నాట్యశాస్త్రము. పుట.567.

2.--నాట్యశాస్త్రము, పుట.567

3.--వేదం వేంకటరాయశాస్త్రి. "రత్నావళి నాటకము"(అమ). ద్వితీయాంకము.పుట 18