Jump to content

పుట:RangastalaSastramu.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంకమంతా ఒకే రంగంగా నడవవచ్చు: లేదా రంగాలుగా విభజించుకోవచ్చు. అయితే రంగాలసంఖ్య తక్కువ అయినకొద్దీ ఏకాంకికకు బిగువు హెచ్చుతుంది.

ఇమ వస్తువు పౌరాణికము కావచ్చు; చారిత్రకముకావచ్చు: సాంఘికముకావచ్చు, పౌరాణీకమైన ఏకాంకికకు జి.వి. కృష్ణారావుగాని "భిక్షాపాత్ర", చారిత్రాకానికి విశ్వనాధ సత్యనారాయణగారి "అనార్కలీ". సాంఘికానికి పి.వి.రాజమన్నారుగారి "ఏమి మగవాళ్లు" మచ్చుతునకలుగా తీసుకోవస్సు.

ఏకాంకికలు ఎక్కువగా వనంలో వెలువడుతున్నాయి. అయితే గేయ- ఏకాంకికలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొప్పరపు సుబ్బారావు గారి "అల్లీముఠా" ఎన్నోసారులు ప్రదర్శితమైంది.

పరిమాణము, కాలపరిమితి తక్కువ కావడంవల్ల ఏకాంకికకు ఉప కధలు హానికరాలే గాని పుష్టికరాలు గావు. అంతా గంటలో ముగియవలె. కాబట్టి దీర్ఘసంభాషణలు ఇందులో నిషిద్ధాలు.

ఏకాంకిక విస్మయము కలిగించే వస్తుపరివర్తనతో ముగియవలె. దీనినే కొసమెరుపు అంటారు.

ఇంగ్లీషులోని ఏకాంకికకు కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు: రైడర్స్ ఆఫ్ ది సీ (Riders of the Sea), ది మంకీస్ పా (The Monkey's Paw), బిషప్స్ కాండిల్ స్టిక్స్ (Bishop's Candlesticks)

విధి నిషేధాలు

1. సంస్కృత నాటకవిధులను అనుసరించి అంకాంతంలో పాత్రలన్నీ నిష్క్రమించవలె. సంస్కృనాటకాలు ప్రదర్శించే మొదటిరోజులలో ముందుతెర లేకపోవడంవల్లనే ఇట్టి నియమాన్ని ప్రవేశపెట్టిఉండవచ్చు.

2."మంగళాదీని, మంగళమధ్యాని, మంగశాంతాని" అనే సూత్ర ప్రకారము రూపకము సుఖాంతంగా ఉండవలెనేకాని దు:ఖాంతంగా ఉండకూడదు.

3.రంగస్థలంమీద నాయకవధ నిషిద్ధము.

4.భారతీయసంప్రదాయానికి విరుద్ధాలు, అసభ్యాలు, జుగుప్సను కలిగించేవి, రంగస్థలంమీద చూపడానికి వీలులేనివి. అనే కారణాలతో సంస్కృతలాక్షణికులు కిందివాటిని ప్రదర్శనంలో నిషేధించినారు- మరణము, యుద్ధము, రాజ్యదేశాది విప్లవము, వివాహము, భోజనము, శాపము, మలవిసర్జనము, రతి, నిద్ర, ఆధరపానము, నగరంముట్టడి, స్నానము, మైపూత మొదలైనవి.