పుట:RangastalaSastramu.djvu/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటిదశ

పాత్ర నిర్ణయానికి మరికొంతమందిని కార్యవర్గంగా ఏర్పాటుచేసి, పూర్వ దర్శనాలు (try outs) జరిపి, పాత్ర నిర్ణయము జరుపుకోవచ్చు.

నటనాభ్యర్ధులు

కార్యవర్గము నటీనటులకు ఎన్నికనిమిత్తముచేసే పరీక్షకు ముందుగా నాటకరంగంలో పాత్రల లక్షణాలు తెలియజెప్పి, అభ్యర్ధుల పేర్ల జాబితా తయారుచేసి, పరీక్షాసమయము, ప్రదేశము తెలియజేయవలె. నాటకంలో ఈ పరీక్షకు ఉపయేగించే సన్నివేశాలను ఎన్నిక చేయవలె. ఎన్నికచేసే సన్నివేశాలలో 7, 8 పాత్రలుండేవీ, అన్ని పాత్రలకు సంభాషణలు ఇంచుమించుగా సమానంగా ఉండేవీ అయితే బాగుంటుంది. ప్రతి ముఖ్యపాత్ర కనీసము ఒక సన్నివేశంలో అయినా ఉండేటట్లు ఈ ఎన్నిక జరగవలె. ప్రధాన పాత్రలకు అనుకూలంగా లేనివారిని చిన్నపాత్రలకు సందర్భానుసారంగా ఉపయోగించుకోవటం మరొక పద్ధతి.

పూర్వదర్శనము (Try out)

దీనిని రెండు దిశలుగా విభజించవచ్చు. మొదటిదశ-- బొత్తిగా పనికెరానివారిని తీసివేసి, మిగిలనవారిచుంచి చివరి ఎన్నిక చేసుకోవచ్చు. ఇదీ గాక మొదటిదశ పూర్వపరీక్ష పూర్తి అయ్యేసరికి , అభ్యర్ధుల ప్రజ్ఞా విశేషాలు దర్శకునకు పూర్తిగా అవగాహన అయి, పరిస్థితి బోధపడుతుంది. మొదటిదశలో జరిగేది అవసరమైన అభ్యర్ధుల ఏరివేత.

మొదటిదశ

ప్రతి అభ్యర్ధిపేరు, వివరాలు, ఏపాత్రకు పరిసేలించవలసినది వ్రాసి జాబితా తయారుచేసుకోవలె. ఎన్నికచేయబడిన సన్నివేశానికి కావలసిన రంగస్థల సామాగ్రి ఉండవలసిన స్థానాలలో అమర్చి ఉంచుకోవలె, అప్పుడు దర్శకుడు అభ్యర్ధులకు--

1. కధాసంవిధానాన్ని తెలియజెప్పి, పాత్రల స్వభావ స్వరూపోఅలు వివరించి, రంగాలంకరణ వగైరా ఎట్లా ఉండేదీ బోధపరచవలె.

2. నటీనటులు తాము నటించిచూపించబోయే పాత్రలు తాత్కాలిగంగా నిర్ణయము చేసినవనీ అవసరమైతే మరొకపాత్రకు ప్రయత్నించవచ్చుననీ చెప్పవలె.