పుట:RangastalaSastramu.djvu/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపొందించవలె. ప్రేయసీప్రియులు అలింగనము చేసుకొనే దృశ్యంలో అవసరమైనప్పుడు వారు రంగస్ద్థలంలో చెరొకవైపున దూరంగా ఉంటే ఇబ్బంది తప్పదు. అట్లాగే,టెలిఫోన్ ఉపయోగించవలసిన పాత్రను దానికి దగ్గరగా ఉండేటట్లు జాగ్రత్తపడవలె. రంగంనుంచి నిష్క్రమించే పాత్ర చివరిసంభాషణలు అతడు నిష్క్రమించేటట్లు చేయవలె. అట్లా కాకపోతే, అతడు నిష్క్రమించేవరకు సన్నివేశము నిలిచిపోయి, రసాభాస అవుతుంది. ఇట్లాంటి సర్ధుబాట్లు అవసరమే అయినా, ఒక్కొక్కసారి నాటక సంవిధానంలో, ప్రధానోద్ధేశాలకు విరుద్ధంగా, భావ వ్యక్తీకరణ చేసే అవకాశము లేకపోలేదు. అందుచేత, దర్శకుడు పాత్ర సమ్మేళనలో ఎంతో నేర్చుకుని ప్రదర్శించవలసి ఉంటుంది.

పాత్రసమ్మేళనకు ప్రత్యేకస్థానాల ఎన్నిక

రంగస్థలంలోని ప్రతి ప్రదేశానికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. రంగస్థలంభూగోళ మెట్లా ఉంటుందో, అభినయావరణ ఏవిధంగా విభజింపబడుతుందో ఇగివ్రకే తెలుసుకొన్నాము. స్థూలంగా చూచినప్పుడు విభాగాల ప్రత్యేక లక్షణాలు సులువుగా బోధపడవచ్చు. ఈ స్థానాల విసిష్టతకూడా సులువుగా బోధపడకపోవచ్చు. ఈ స్థానాల విశిష్టల్తను తెలియజెప్పిన తరవాత అది సుబోధకమవుతుంది. సాధ్యమైనంతవరకు వాటి ప్రత్యేకలక్షణాలకు అనుగుణమైన సన్నివేశాలు సమీకరిస్తే, ఎక్కువ పుష్టి పొందుతాయి.

రంగస్థల ప్రదేశలక్షణాలు

1. కుడినుంచి ఎడమకు ప్రవేశలక్షణాలు క్రమంగా మారతాయి. అన్ని పరిస్థితులూ సమానంగా ఉండి, రెండుపాత్రల సంఘర్షణలో (conflict) ఉన్నప్పుడు, కుడిపక్కన ఉన్నపాత్ర, మధ్యనగాని, అడమనగాని ఉన్న పాత్ర కంటె శక్తిమంతంగా ఉంటుంది.

2. వృష్ఠరంగభాగము (upstage area) ప్రేక్షకులకు దూరంగా ఉండడంవల్ల నిరుత్సాహజనకంగా కనిపిస్తుంది.

3. రంగస్థలంచుట్టూ అంచులదగ్గరగా ఉండే ప్రదేశాలు మార్ధవాన్నీ సాన్నిహిత్యాన్నిఈ; పురోరంగము (దిగువ), మధ్య (down centre) భాగాలు కఠినత్వాన్ని సూచిస్తాయి.