Jump to content

పుట:RangastalaSastramu.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గతివిన్యాసంలో ముగింపుదశలు

కన్నా శక్తిహీనమైనది. వంపు ఎక్కువైనకొద్దీ, శక్తిహీనత ఎక్కువై, కదలికలోని శక్తి ప్రకటన తగ్గిపోరుంది.

1. ఏదమనుంచి కుడివైపునకు, 2. ఎత్తు తక్కువనుండి ఎక్కువఉండే చలనాలు శక్తిమంతాలే అయినా, వాటిశక్తి ఇతర పరిస్థితులోమీదకూడా ఆధారపడి ఉంటుందని మరవకూడదు.

కదలికలలోని శక్తి కేవలము వాటివల్లనే, మంచినిగాని, చెడునుగాని సూచించలేవు. ఆ కదలికలు, ఉపయోగించే పాత్రల సహజ-అంతర్గతస్వభావలక్షణాలకు సముచితంగా ఉండవలె.

గతివిన్యాసంలొ ముగింపుదశలు (Movement Endings)

కేవలము చలనంవల్లనేగాక, ఆప్రత్యేక సలనంయొక్క ముగింపుమీద- దానిశక్తి ప్రాధాన్యాలు అధారపడి ఉంటాయి. ఒక పాత్ర కూర్చున్నప్పుడు, ఆ కదలిక ఎత్తునుంచి దిగువకు జరిగే కదలిక అవటంవల్ల బలహీనమైన కదలిక అయినప్పటికీ, కూర్చున్న

తరవాత నిటారుగా సర్దుకోవటంద్వారా, ఆ కదలికను మలచినప్పుడు ఆ పాత్ర లేచినిలుచున్నంత శక్తినీ, ప్రాధాన్యాన్నీ సాధించగలుగుతుంది (చూ.పటము 15). అట్లాగే, శక్తివంతమైన కదలిక ముగింపుదశలో శక్తిహీనమైతే అది శక్తిహీనతనే సూచిస్తుంది. కాబట్టి ప్రతికదలికకూ ముగింపు అతిముఖ్యమైనది. అనిశ్చితాలైన (doubtful) ముగింపులు శక్తిహీనమైనవి. ముగింపులోని ఒక చేయకు దానిని శక్తివంతము చేస్తుంది. కింది కదలికల ముగింపులు శక్తి తీవరతమై ఎక్కువగా సాధించే అవకాశము కలిగి ఉంటాయి--

1. చలనం చివర చిన్న మణికట్టు కదలికవంటి ఒక ఉద్వేగ విన్యాసము ప్రవేశపెట్టవలె.

2. ఈ అంగవిక్షేపము (gesture) కండర సంకోచంద్వారా (offening muscles) హఠాత్తుగా ఆపివెయ్యవలె. ఇది సూటిగాచేసే అంగి విశేషాలకే పనికివస్తుంది.