Jump to content

పుట:RangastalaSastramu.djvu/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కదలికలు ప్రయోగప్రైత్లో వ్రాసుకొనేటప్పుడు అవి వివరంగా, నిర్ధిష్టంగా నటీనటులకు తెలిఅజెప్పేటందుకు అభినయావరణను మరించ సూక్ష్మంగా విభజించటం అవసరమని తెలుసుకొన్నాము. కదలికలు ప్రయోగ ప్రతిలో వ్రాసేముందు దర్శకుడు తన భావనాశక్తిని బాగా వినియోగించవలె. కదలికలు రూపొందించటం చదరంగం ఎత్తులోవలెనే ముందుజాగ్రత్తతో తర్వాతి కదలికలకు అనుకూలంగా చేయవలె. సన్నివేశం నడకను బట్,టీ పాత్ర ప్రవేశ నిష్క్రమణాలనుబట్టీ, నటీనటుల సంఖ్యనుబట్టీ, దృశ్య సమ్మేళనాన్నిబట్టీ కదలికలు ఏర్పరచుకోవలె. కదలికలను గురించి ప్రత్యేకంగా తర్వాతి అధ్యాయంలో వివరంగా ముచ్చటింప బడుతుంది. ప్రయోగప్రతిలో కదలికలు వ్రాయటం నిర్ధిష్టతకొరకు మాత్రమే అని గమనించవలె. పాత్రల స్థానాలు వారు కూర్చుండే కుర్చీలమీద, వారి పొడి అక్షరాలు వ్రాయటంద్వారా బొమ్మలో చూపినట్లు (చూ.పటము 10) సూచించవచ్చు.

11వ పటంలోఉన్న 20 అభినయావరణ విభాగాలు ఉంటే ఉదాహరణకు ULలో ఉన్ననటుడు DR(down right) క్రాస్ చేస్తాడు అని ప్రయోగప్రతిలో వ్రాస్తే 11-1 బొమ్మలోఉన్న ఏదోఒక మార్గాన్ని అనుసరించవచ్చు. అట్లాగాక బొమ్మలోని 20 విభాగాలు అనుసరించినప్పుడు మరింత నిర్ధిష్టంగా 'UL 3 నుంచి DR 1 లోని కుర్చీవద్దకు LC3, CRC 'ల ద్వారా అని సూచించవచ్చు. 11-2 బొమ్మలో ఉన్న 15 విభాగాలు ఈ నిర్ధుష్టతను సాధించలేవు.

రంగదర్శక సూచనలు

ఇవి నాలుగు రకాలు---
1.కదలికలు
2.ఉద్వేగసూచనలు
3.కార్యకలాపసూచనలు
4.సంభాషణల స్థాయి, విరామాలను గురించిన సూచనలు

ఈ సూచనలన్నింటికి ప్రయోగప్రతిలో స్థానముండితీరవలె.