Jump to content

పుట:RangastalaSastramu.djvu/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షై తిజదృష్టిరేంఅలు (horizontal sight lines), ఉదగ్ర దేష్టిరేఖలు (vertical sight lines) గురిచూసుకొని ప్లాను (Plan) ను స్థిరపరచుకోవలె.

ప్రదర్శన ప్రతిలో ప్రతిలో ప్రతిరంగదృశ్యానికీ ఒక ప్లాను ఈ రకంగా తయారుచేసినది జోడించవలె. దర్శకుడు రంగచలనము, దృశ్ల్య సమ్మేళనము వగైరాలు ముందుగానే ఊహించి సుద్ధము చేసుకొన్నప్పటికీ, అవి ప్రదర్శన ప్రతిలో ఎట్లాచేర్చి, కూర్చుకోవలెనో చర్చించుకొన్నప్పటికీ, అవి ప్రదర్శన ప్రతిలో ఎట్లాచేర్చి, కూర్చుకోవలెనో చర్చించుకొందాము. అభినయావరణ విభాగాలు ఎట్లాచేసుకొంటారో కిందటి అ;ధ్యాయంలోవివరింపబడింది. ఆ విభాగాలు ఆధారంగానే సూచనలన్నీ వ్రాయవలె. ఈ సూచనలు మరింత చక్కగా పాటించవలెనంటే రంగస్థల పరికరాలు స్కేలుప్రకారము సరిఅయిన స్థానాలలో రంగస్థలంమీద పూర్వాభ్యాసము (rehearsals) జరుగుతున్నప్పుడు కూడా అమర్చవలె.

ప్రయోగ ప్రతిని తయారుచేసేటప్పుడు, నాటకప్రతి ఒకపక్కనూ, తెల్లకాగితము మరొకపక్కనూ ఉండేటట్లు పుస్తకము తయారుచేసుకొని, తన సూచనలన్నీ దర్శకుదు వీలైనంతవరకూ ఖాళీగాఉన్న తెల్లకాగితంమీద వ్రాసుకోవలె. ఈ ప్రయోగప్రతి కుడివైపున, నాటకప్రతిపాఠము ఎడమవైపున ఉండవలె.

ప్రయోగప్రతిలో ఏ సంభాషణ జరుపుతున్నప్పుడు ఏపాత్ర ఎక్కడ ఉండవలెనో పాత్రలు ఎటుపక్క ఎందరు ఉండవలెనో, కదలికలు ఎట్లా ఉంటవో, వ్యక్తిగత కార్యకలాపాలు ఏమేమి ఉంటవో స్థూలంగా నిర్ణయించుకొని ముందు పెనిసిల్ తో వ్రాసుకోవలె. పూర్వాభ్యాసము (rehearsals) జరుగుతున్నకొద్దీ, మార్పులు చేర్పులు వచ్చి, చివరకు ఏఏ కదలికలు ఎట్లాజరు;గుతాయో, ఏసంభాషణలో ఏపాత్రఏస్థానంలో ఉంటుందో, ఏకార్యకలాపము జరుగుతుందో, దృశ్యసమ్మేళనము ఎట్లా రూపొందుతుందో పూర్తిగా నిర్ణయమౌతుంది. అప్పుడు అది సిరాతో వ్రాసుకోవచ్చు. అట్లాగే ముందు ప్రవేశించవలసిన పాత్రలు సంసిద్ధంగా ఉండేందుకు, ఎఫెక్ట్సుకు, తెరపడడం మొదలైన వాటికి హెచ్చరికలు చేసేటందుకు వాటిస్థానాలు ప్రయోగప్రతిలో వ్రాసుకోవలె. ప్రతి దృశ్యానికి ముందు దానిలో కావలసిన నటీనటుల వ్యక్తిగత సామగ్రి (hand props), దుస్తులు మొదలైన అంశాలు, ప్రదీపనకు సూచనలు ప్రయోగప్రతిలోనే వ్రాసుకోవలె.