పుట:RangastalaSastramu.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినయావరణ సక్రమ వినియోగము

దృశ్య సంరచనలోను రంగస్థలం ముందునుంచి వెనకకు మధ్యగా తిన్ననిరేఖ (ఊహలో) ఏర్పరచుకొంటే ఈ మధ్యరేఖ (center line) కు రెండుపక్కల ఉండే వస్తువులుగానీ, వ్యక్తులుగానీ సమాన ప్రాముఖ్యంలో ఉండవలె. ఉదా|| కుడిపక్క చివరగాఉన్న కొద్ది వస్తు;వులకు ఎడమపక్క మధ్యగాఉన్న ఎక్కువ వస్తువులకు తూకము సరిపోతుంది (చూ.పటములు 4,5) రెండుపక్కలా సమానంగా ఉండే ఈ తూకము నిర్ణయించటం దర్శకునికి నటీనటులకు సమ్మేళనంలో (grouping of actors) అవసరమవుతుంది. కాని నటీనటులకు వారంతటవారు కదలికలు సాధించగలిగే సౌలభ్యంవల్ల, స్థానాలను అవసరాన్నిబట్టి మార్చటంద్వారా సక్రమసంరంచన సాధించటం సులభము. రంగస్థలంపై అమర్చే వస్తుసముదాయం విషయంలో మాత్రము శ్రద్ధ తీసుకోవలె. చిన్నచిన్న దృశ్య సమ్మేళనాలు (small groupings) సర్వషాధారణంగా, రెండుమూడు అభినయావరణ (parts of acting area) భాగాలకే పరిమితము కావటం సహజము కాబట్టి, అభినయానరణ పూర్తిగా వినియోగించినప్పుడే దర్శకుడు ఈ అంశంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవలసిన అవసరమేర్పడుతుంది.

స్థిరత్వము (Stability)

ఐదరు పాత్రలకన్న ఎక్కువమంది రంగస్థలంమీద ఉన్నప్పుడు దృశ్యసంరచన ఒక స్థిరత్వాన్ని సాచించగలగటం కష్టమవుతుంది. అందుచేత రంగస్థలంలోని అభినయావరణ దిగువ కోణాలలో (Down corners) ఒకరిద్దరి స్థానాలు, కుడి ఎడమలలో (Down Right and Down Left) నిర్దేశించటం సంరచనకు పుష్టినిస్సుంది.

అభినయావరణ సక్రమ వినియోగము (Utilisation of the Acting Area)

దర్శకుడు సహజ వాతావరణ సృష్టి సంకల్పించినప్పుడు అభినయావరణ పూర్తిగా వినియోగించి, ప్రతి ప్రదేశాన్ని ఏదోవిధంగా నింపవలసిన అవసర మేర్పడుతుంది. సాంప్రదాయిక నాటకాలలో (Classical Plays) ఖాళీ ఎక్కువగా ఉండే అభినయావరణభాగము మరింత అవసరమవుతుంది. నాటక దృశ్యంలో అభినయావరణభాగము మరింత అవసరమవుతుంది. నాటక దృశ్యంలో అభినయావరణ లోతు (depth) ముఖ్యాంశము. ప్రహసనాలలో (farces) లోతు తక్కువగా ఉండటం ప్రదర్శనకు సౌలభ్యము కలిగిస్తుంది.