పుట:RangastalaSastramu.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమతూకము

సంరచన సాధారణంగా భయపడేటంత కష్టముకాదు. సంరచనచేసే కళాకారుడు ఆ పద్ధతివల్లె, ఏవిధంగా ప్రతిస్పందన పొందుతాడో, అదేవిధమైన అనుభూతి ప్రేక్షకులుకూడా పొందగలరని ఊహించవచ్చు. దీనితో అనుభవము సాధించేట,దిలి. దర్శలిడి తాను చూసే ప్రతి నాటకంలోను చలనచిత్రంలోను దృశ్యసంరచన ఏ విధమైన ఉద్వేగఫలితాలను సాధిస్తున్నదో జాగ్రత్తగా పరిశేలించి, తానవలంబించే ప్రయోగంలోని దృశ్యసంరచనలోను, సమీకరణ పద్దతులలోను ఆ అనుబంధాన్ని నెమరు తెచ్చుకొని, సంరచనలోని మూలాంశాలను- రేఖలు, వర్ణాలు, రాసులు మొదలైనవాటి ఉద్వేగఫలితాలను పోల్చుకొని, సంరచనా పద్ధతులను నిర్ణయించుకోవలసి ఉంటుంది.

మేళన- విపర్యయము (Harmony and Contrast)

రేఖలు, స్వరూపాలు, వర్ణాలు రంగస్థలదృశ్యంలో పోలికలు కలిగి ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మేళన (Harmony) అంటారు, ఉదాహరణకు: ఆకుపచ్చ వర్ణంలో వివిధచ్చాయలు గలిగిన దుస్తులు వాడినప్పుడు అవి మేళవించి (harmonious) ఉంటాయి. మూలాంశాలలో వైవిధ్యము ఉపయోగించబడినప్పుడు, ఆ పరిస్థితిని (contrast) విపర్యయ మంటారు. ఉదాహరణకు: ఆకుపచ్చ, ఎరుపు కలిసినప్పుడు; తిన్ననిరేఖలు, ఐమూలరేఖలు (straight and diagonal lines) కలిపి ఉయోగించినప్పుడు అది విపర్యయమవుతుంది. వీలైనంతవరకు ఈ మూలాంశాలు (elements) మేళవించవలె; లేదా స్పష్టమైన తారతమ్యము (contrast) కలిగినవిగా అయినా ఉండవలెనేగాని, అటూ ఇటూ గాని సంరచన అర్ధరహితము, నిష్ప్రయోజనము అవుతుంది. ముఖ్యంగా నాటక సన్నివేశంలోని సంఘర్షణ తీవ్రతను బట్టి (intensity of conflict) ఈ తారతమ్య తీవ్రత (intensity of contrast) ఉంటుంది. సంరచనను ఈ సిద్ధాంతమాధారంగా సృజించవలె.

సమతూకము (Balance)

పాత్రసమ్మేళనాన్ని (Grouping) రంగస్థలం రెండువైపులా సమానంగా పంచకపోతే ప్రేక్షకానురక్తి సక్రమంగా రూపొందదు. వారి ఏకాగ్రతకు భంగము కలిగి వికృతీకరణ (distortion) ఏర్పడుతుంది. కాబట్టి, రెండువైపుల సమాన ప్రాముఖ్యము కల్పించవలె (చూ.పటము 3). సమీకరణలోను,

సమతూకము (Balance)

పాత్రసమ్మేళనాన్ని (Grouping) రంగస్థలం రెండువైపుల సమానంగా పంచకపోతే ప్రేక్షకానురక్తీ సక్రమంగా రూపొందదు. వారి ఏకాగ్రతకు భంగము కలిగి వికృతీకరణ (distortion)ఏర్పడుతుంది. కాబట్టి, రెండు వైపుల సమాన ప్రాముఖ్యము కల్పించవలె.(చూ.పటము 3)సమీకరణలోను