Jump to content

పుట:RangastalaSastramu.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టెలిఫోను) వంటివి ప్రేక్షకుల ఏకాగ్రతకు భంగముకలిగించి వారి అవదానానికి అవరోధాలు కల్పిస్తాయి. కాబట్టి దర్శకుడు అప్రమత్తుడై ఉండి, ప్రదర్శన రూపొందించవలె.

మనస్తత్వశాస్త్రపరిశీలననుబట్టిచూస్తే, ఒకేరమమైన ప్రదర్శనగమనంవల్ల ప్రేక్షకావధానమూ ఏకాగ్రతా దెబ్బతింటాయి అని స్పష్టమవుతుంది. కాబట్టి, ప్రయోగంలో గమనవేగము, స్థాయి, లయవిన్యాసము మొదలైనవాటినీ, భావప్రకటనవిశేషాలనూ వైవిధ్యంతో రూపొందించవలె. ప్రేక్షకులు అవధానము చెడకుండా వారికి ప్రదర్శనలో కుతూలనాన్నీ, అనురక్తినీ కూర్చేటందుకు, ప్రదర్శన సాఫీగానడిచేందుకు దర్శకుడు నిరంతరమూ కొత్తవిధానాలను సృష్టిస్తూఉండవలె.

ప్రతినాటకంలోను కొన్నిముఖ్యసంభాషణలు, కొన్నిఅభినయవిశేషాలు (నాటక కధావస్తువుకు ప్రాముఖ్యము కలిగింఛేశక్తికలవి.) దర్శకుడు పరిశీలించి వాటిని అర్ధయుక్తంగా సక్రమంగా ప్రేక్షకులు అందుకొనేటట్లు జాగ్రతపడవలె. ఇట్లాంటివిశేషాలు తిరిగితిరిగి చెప్పడంద్వారా సాధించవచ్చుకాని కధాసంవిధానంలో అట్లాంటి ప్రక్రియకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు, అది ఆవిధంగా ప్రేక్షకులకు అందకపోవడంచేత వారికి పరానుభూతి (empathy) కలగనప్పుడు నాటకప్రధానోద్దేశము స్పష్టపడేందుకు అవసరమైన రంగకార్యకలాపము, కదలికలు, రంగదృశ్యరూపకల్పన, వాచికవిఅవిధ్యము కాంతిప్రకాశనము రూపొందించి, అవసరమైన పాత్రయందు ప్రేక్షకావధానము ఏకాగ్రంగా లగ్నమయ్యేటట్లు జాగ్రత్త పడవలె. సంభాషణలకు, సన్నివేశాలకు ప్ర్రాముఖ్యము కల్పించవలె.

అవధాననియంత్రణము (Control of Attention)

ప్రయోగాలను బట్టి ఏకాగ్రతతొ కూడిన ప్రేక్షకావధానము రంగస్థలం మీద నిలిచేటట్లు చేయటమేగాక అవసరాన్ని బట్టి దాన్ని రంగస్థలంలోని ఒక ప్రత్యేకప్రదేశం మీద కేంద్రీకరింపజేయడం, లేదా ఒక ప్రదేశంనుంచి మరొక ప్రదేశానికి మార్చడం అవసరము కావచ్చు. ఇందుకు మొదటి ప్రయత్నంగా నాటక ప్రయోగంలోని ముఖ్యాంశాలు గమనించి, వాటివల్ల వచ్చే ఏకాగ్రతా సాధన ఫలితాలు పరిశీలించి వాటిని దర్శకుడు సమీకరించుకోవలె. ఏకాగ్రత, అవధానము కిందివాటి మీద ఆధికంగా ఉంటాయి.