పుట:RangastalaSastramu.djvu/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకీయ వాస్తవికత (Theatricalised Realism)

నిత్యజీవిత పద్ధతులను పూర్తిగా అనుకరించకుండా సాంకేతిక పద్ధతుల (technical means) ద్వారా అది వాస్తవికమే అనే భ్రాంతిని (illusion)  కలిగించడం నాటకీయ వాస్తవికత. ఇట్లాంటి నాటకంయొక్క అంతర్గత భావము ప్రహసనము (farce) అనీ, మామూలు నాటకమయితే మెలోడ్రామా (melodrama) అనీ అంటారు.

అవాస్తవిక శైలి (Non-Realistic Style)

నిత్యజీవితదృక్పధానికి విరుద్ధంగా నాటకాన్ని రచిస్తే దానిని అవాస్తవికశైలి అంటారు. నిత్యజీవిత ప్రమాణాలకు అతీతంగా ఉండే మన:స్థితిలో కాని నాటకవస్తువు ప్రేక్షకానుభూతిని కలిగించకపోతే, ప్రేక్షకులకు సరియైన దృక్పధం కలిగించడంద్వారా రససిద్ధిని సాధించేటందుకు ఈ శైలిని అవలంబించడం జరుగుతుంది. అవాస్తవికశైలిలో ఉద్ధేశపూర్వకంగా సంభాషణలలో కృత్రిమత్వము (artificiality), పద్యాలు (verse), అసాధారణ పద ప్రయోగము (unnatural phrascology) మొదలైన పద్ధతులు అవలంహిస్తారు పాత్రలచేత సహజంగా మాటాడించడానికి బదులు ఉపన్యాసధోరణి, స్వగరాలు, జనాంతికాలు మొదలైన పద్ధతులు విరివిగా ప్రయుక్తమవుతాయి. ఒక్కొక్కసారి ప్రేక్షకుల నుద్దేశించి చెప్పే సంభాషణలుకూడా ఉండవచ్చు. ఇదీ ఉద్దేశ్యపూర్వకమే. నాటకంలోని భావాలు కొందరి వ్యక్తుల అనుభవాలో కొన్ని దేశకాల పరిస్థితులలోని భావాలో కాకుండా సర్వకాలాలకూ, సమస్త దేశాలకూ, సకల మానవులకూ వర్తించే 'నిత్య సతూలూ అని సందేశ్ మివ్వదలచినఫ్ఫుడు రచయిత ఒక ప్రత్యేకశైలిని అవలంబించవచ్చు. అట్లాంటి శైలిని సాంప్రదాయికశైలి (classic style) అంటారు. ఈ శైలి పై విధంగా ఒక సార్వజనీన, సార్ఫకాలిక సత్యాన్ని (universal truth) చెప్పడానికికాక, కేవలము ప్రదర్శన సౌలభ్యం కోసమే అవలంబింతమయితే దాన్ని 'ఫార్మలిజం ' (formalism) అంటారు.

కాల్పనిక శైలి (Romantic Style)

వాస్తవజీవితంలోకంటె రమణీయంగాను, ఆకర్షణీయంగాను సన్నివేశాలనూ, కధనూ చిత్రించే ప్రయత్నంలో అద్భుతాలు, సాహసాలు