పుట:RangastalaSastramu.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1 రూపకోత్పత్తి* original of Drama

నాటకము సకలజనులను ఆకర్షించే ఉత్తమ సాహిత్య ప్రక్రియ. అందుకే 'నాటకాంతం హి సాహిత్యమ్' అనీ. 'కావ్యేషు నాటకం రమ్యమ్' అనీ అన్నారు పెద్దలు. ఇక నాటకకళ సకల కళలను తనలోఇముడ్చుకొన్న సమాహార కళ. కాళిదాసు 'మాళవికాగ్నిమిత్రము ' లో అభివర్ణించినట్లు ఈ కళ 'అమరావళికి కనులకింపగు యజ్ఞము '. 'హృది దనియంచు నాట్యమిల నెల్లరనున్ రుచి భేద చిత్తులన్ ' (కందుకూరివారి అనువాదము). అందుచేత ఈ కళ ఎట్లా అవిర్భవించిందో ముందుగా తెలుసుకోవడం ఎంతైనా అవసరము; ఆసక్తి దాయకము. అయితే ఈ కళ అవిర్భావ విషయంలో అటు పాశ్చాత్య దేశాలలోను, ఇటు భారత దేశంలోనూ కూడ విభిన్నమతాలు నెలకొని ఉన్నాయి.

మానవుడు పుట్టగానే కూర్చోవడం లేదు. నిలబడడం లేదు. మాటాడడం లేదు. కాని, కాలం గడిచిన కొదీ, పెద్దవాడవుతున్న కొద్దీ, కూర్చుంటున్నాడు. నిలబడుతున్నాడు, మాటాడుతున్నాడు. వయస్సుకుతగిన పనులు చేస్తున్నాడు. ఈ పరిణామానికి కారణమేమిటి? ఈ శక్తి మానవునికి ఎట్లా వచ్చింది?

పాశ్చాత్య సింద్ధాంతాలు

అనుకరణ ప్రవృత్తి సిద్ధాంతము.

మానవుడు అనుకరణశీలి. పుట్టుకతోనే అస్తనికి అనుకరణ అక్తి అల


  • రూపకశభ్దము సామాన్య వాచకము: ఇంగ్లీషులోని డ్రామా(Drama), ప్లే (play) అనే పదాలకు సమానార్థకము. ఇక నాటకము ప్రత్యేక లక్షణాలతో కూడిన రూపభేదము. రూపక, నాటక పదాల అర్థభేదాన్ని గమనించడం అవసరము. అయితే క్రమేపి రూపక, నాటక పదాలు వాడుకలో పర్యాయపదాలుగా ఉపయోగింప బడుతున్నాయి.

'నాట్యము ' అనే పదము డాన్స్ (Dance) అనే ఇంగ్లీషు పదానికి సమానర్థకంగా వాడుకలోనికివచ్చినది. కాని సంస్కృత లాక్షణికులు నాట్య పదాన్ని రూపక ప్రదర్శనము అన్న అర్థంలోనే వాడినారు.