పుట:RangastalaSastramu.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోలాచలము శ్రీనివసరావు

కిరాతార్జునీయంలో స్త్రీ స్వాతంత్ర్యము, 'పాంచాలీ స్వయంవరం ' లో విదేశీవస్తు బహిష్కారము ప్రస్తావించడం ఇందుకుదాహరణలు.

ఆచార్యులుగారు ప్రజలు, ప్రజాస్వామ్యము వీటి ప్ర్రాముఖ్యాన్ని గుర్తించి 'చిత్రనళీయము.' 'పాదుక ' నాటకాలలో ప్రజాసందోహాన్ని పౌరులనే పేరుతొ పాత్రలుగా రంగస్థలంమీద ప్రవేశపెట్టితినారు. ఈ ప్రక్రియకుకూడ వీరే ఆద్యులు.

'మగలాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని ' అనే భారతీయ సంప్రదాయాన్ని ధిక్కరించి సారంగధరకధను విషాదాంతంగా రచించి తెలుగులో ప్రప్రధమ విషాదనాటక స్రష్టగా పేరుపొందినారు.

217 పద్యాలు, 63 పాటలు, 15 సంవాదకీర్తనలతో 'చిత్రనళీయము ' రచించిన ఆచార్యులవారు పాటలవలన ఎప్పటికీ భావప్రకటనము సముచితింగా కలుగజాలదని 'అజామిశ ' నాటకము పూర్తిగా వచనంలోనే రచించినారు.

కధా సంవిధాన నిర్వహణలో, సన్నివేశ కల్పనలో, నాటకీయతలో, వ్యంగ్యప్రయోగంలో, సాదృశ్యవిపర్యయాలను చొప్పించడంలో, పాత్రమనీవృత్తి చిత్రీకరణలో వారు ప్రజ్ఞావంతులు. వారికి కరుణరసము అభిమాన రసము.

వారి రచించిన 22 తెలుగు నాటకాలలోను 25 పౌరాణికాలు, 2 చారిత్రకాలు (సారంగధర, రోషనార), వీటిలో నాలుగు (సారంగధర, చంద్రహాస, ముక్తావళి, అజామిశ) విషాదాంత నాటకాలు.

ఈ 28లో 14 మాత్రమే ముద్రిత మయినవి. తెలుగులోనె గాక ఇంగ్లీషులో 'హరిశ్చంద్ర.' ఉషాపరిణయము ' వారు రచించినారు.

కోలచలము శ్రీనివాసరావు

ధర్మవరంవారిని గురించి చెప్పుకొన్నప్పుడల్లా వారితో ఎన్నో విషయాలలో దీటైన కోలాచలము శ్రీనివాసరావుగారిని కూడా పేర్కొనవలసిందే! ప్రఖ్యాత చారిత్రక నాటక్కర్తగా పేరొందిన శ్రీనివాసరావుగారు కేవలము నాటక