పుట:RangastalaSastramu.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాయాలను రంగరించి కొత్తపోకడలతో స్వతంత్ర నాటకాలను వ్రాయసాగినారు. వారి ప్రప్రధమ నాటకము 'చిత్రనళీయము ' (1886). ఇది గద్య, పద్య, గేయాత్మకము. నాటకకర్తలైన ఆచార్యులవారే స్యయంగా దర్శకత్వమునెరపి, వేషధారణచేసినాటకాలు ఆకర్షణీయంగా ప్రదర్శించి అశేషప్రజానీకంయొక్క ఆదరాభిమానాలు చూదరగొన్నారు. గద్య, పద్య, గేయూఅత్మక పౌరాణిక నాటకాలకేకాదు. విషాతాంత నాటకాలకుకూడ ఆద్యులు ధర్మవరంవారే ! విషాద సారంగధర నాటకరచనతో తెలుగు నాటక సాహిత్యంలో ఇంకోకొత్తయుగము ప్రారంభమైనది. వారి గద్య, పద్య, గేయాత్మక వాటకాలప్రభావము తెలుగునాటక సాహిత్యంమీద ఎంతగానో పడింది.

ఈ ప్రభావానికి తొలిగా లోనైనవారు కోలాచలం శ్రీనివాసరావుగారు, ధర్మవరం వారితో పోటాపోటీగా, వారివలెనే వీరుకూడ నాటకాలు రచించినరు. ధర్మవరం వారు పౌరాణిక నాటకాలు ఎక్కువగావ్రాస్తే, కోలాచలంవారు చారిత్రక నాటకాలను ఎక్కువగా రచించినారు.

ఈ బళ్ళారినాటకాలు క్రమంగా రాయలసీమ ఎల్లలుదాటి సర్కారుజిల్లాలు ప్రవేశించి అశెషప్రజానీకం యొక్క అదరాభిమానాలు చూరగొన్నాయి. నాటక రచయితలు నటుల ఈ నూతన ప్రక్రియకు స్వాగతము పలికినారు. నటులు, ప్రేక్షకులు బళ్లారి నాటకాలమీద మోజుచూపడంవల్ల, అప్పటివరకు వచననాటకాలు వ్రాస్తున్న చిలకమర్తి ప్రభృతులు తమ రచనా విధానాన్ని మర్చుకొని, నటులను ప్రజలను సంతృప్తి పరచడానికి గద్య, పద్య, గేయత్మక నాటకాలను రచించసాగినారు. ఈ బళ్ళారి నాటకాల ప్రభావము ఎక్కువై పద్యాలు, పాటలు ఉన్న నాటకాలే నాటకాలన్న భావము దేశమంతటా అలముకొన్నది. నాటకరచయితలు తమ నాటకాలపేరుకు ముందు సంగీత అనే పదము జోడించకుండా ప్రారంభించినారు. పద్య నాటకయుగము ప్రారంభమైనది. ఈ ఒరవడిలోనే చిలకమర్తి, తిరుపతివేంకటకవులు, చక్రావధానులు మాణీక్యశర్మ, సోమరాజు రామారారు, మొదలయిన రచయితలు నాటకాలను శరపరంపరగా వెలువరించసాగినారు. చిత్రనళినీయంలో 217 పద్యాలు, 63 పాటలు, 15 సంవాదగేయాలు ఉండగా, తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగము ఒక్కదానిలోనే 338 పద్యాలున్నవి ! దీనినిబట్టి ఆనాడు పద్యాలమోజు ఎంతగా ప్రబలినదో ఊహించుకోవచ్చు.