పుట:RangastalaSastramu.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావనాటకచక్రము

ఇంతవరకు లభ్యమవుతున్న సంస్కృతరూపకాలలో అతిప్రాచీనమైనవి అశ్వఘోషుని నాటకత్రయము-సారిపుత్ర ప్రకరణము, మరిరెండు. అయితే ఇవి పూర్తిగా లభించడంలేదు. ఈ రూపకఖండాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, నాటికే సంస్కృత రూపకము పరిణతిచెందినదని బోధపడుతుంది. పారిపుత్రప్రకరణము బౌద్ధగాధ. రెంఛవది అన్యాపదేశరూపకము. (Allegorical Play) ఇందులో బుద్ధి, కీర్తి, ధృతి మొదలైనవివి పాత్రలు. అర్వాచీనకాలంలోని ప్రబోధ చంద్రోదయాది రూపకాలకు ఇది మార్గదర్శిఅయి ఉండవచ్చు. మూడవది మృచ్చకటికమువంటి ప్రకరణము.

ఆశ్వఘోషుని తరవాత మనకు తారసిల్లే నాటకకర్త భాసుడు (క్రీ.శ. 2 వ శరాబ్దము). కాళిదాసు "మాళవికాగ్నిమిత్ర" ప్రస్తావనలో భాస సౌమిల్ల కవిపుత్రాదులను పేర్కొనడాన్నిబట్టి భాసుడు కాళిదాసుకంటె పూర్వుడని నిశ్చయంగా చెప్పవచ్చు. నాట్యశాస్త్ర నియమాలను కాద్ని భాసుడు ఊరుభంగము అనే రూపకాన్ని విషాదాంతంగా రచించడంవల్ల , ఊరుభంగంలోల్ దుర్యోధనుని మృతి రంగస్థలంమీద రూపకంవల్ల కొందరు భాసుడు భరతునికంటె పూర్వుడని అభిప్రాయ పడుతున్నారు. అతడు కావలెననే ఆ నియమాలను ఉల్లంఘించి ఉంటాడని మరికొందరు అభిప్రాయము.

భాసమహాకవి సంస్కృతరూపక సాహిత్యంలో విశిష్టస్థానము సంపాదించుకొన్నాడు. ఇతని రూపకాలు 13. అందులో 9 విశేషాంకాలు, 4 ఏకాంకాలు. ఇన్ని రూపకాలు రచించినకవి సంస్కృత నాటక సాహిత్యంలో మరొకరుకనిపించరు. వీటిలో భారతరూపకాలు 5, రామాయణ రూపకాలు 3, భాగవత రూపకము 1, కధాసరిత్సాగర కధలు 3, కల్పితము 1.

భాసనాటకచక్రము: 1.ప్రతిజ్ఞా యౌగంధరాయణము, 2.స్వప్నవాసవదత్త, 3.అవిమారకము, 4.బాలచరితము, 5.ప్రతిమ, 6.పంచరాత్రము, 7.అభిషేకము, 8.దరిద్ర చారుదత్తము, 9.మధ్యమ వ్యాయోగము, 10. దూతవాక్యము, 11.దూత ఘటోత్కచము, 12.కఋనభారము, 13.ఊరుభంగము.

పండిత టి. గణపతిశాస్త్రిగారు 1909 లో ఈ రూపకాలు తాళపత్ర ప్రతులను బయటికి తీసి 1912లో ప్రచురించేవరకు వీటివిషయము లోకానికి