పుట:RangastalaSastramu.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకీయ వ్యంగ్యము (Dramatic Irony)

విపర్యంలో మరో ప్రధానభేదము నాటకీయ వ్యంగ్యము. దీనినే సంసృతాలంకారికులు "పతాకష్థానము" అన్నారు. క్లుప్తంగా నిర్వచించాలంటే- ఒకేవస్తువు లేదా విషయము రెండు విభిన్నదృష్టులకు గురికావచ్చు. ఈవిభిన్నదృష్టులు ఆ క్షణంలోనే పొడగట్టవచ్చు; లేదా ఆ తరవాత పొడగట్టవచ్చు. రంగస్థలంమీద జరిగిన సంఘటననుగాని, సంభాషణను గాని పాత్రలు ఒక అర్ధంలో గ్రహిస్తే ప్రేక్షకులు ఇంకో అర్ధంలో గ్రహించడం మూలంగా ఉత్పన్నమైన చమత్కృతియే నాటకీయవ్యంగ్యము. దీనికి మూలము ప్రేక్షకులకు తెలిసిన అసలు విషయం గుట్టు తెలియక పాత్రలు వ్యవహరించడం లేదా సంభాషించడం. ఈ విపర్యయము ప్రక్తియలోగాని, భాషణలోగాని సంభవిస్తుంది. కనుక జాటకీయవ్యంగ్యాన్ని రెందు రకాలుగా విభజించుకోవచ్చు- 1.సన్నివేశవ్యంగ్యము. 2.వాచిక వ్యంగ్యము. ఒక్కొక్కప్పుడు ఈ రెండురకాల వ్యంగ్యాలు కలిసి కూడా ఉండవచ్చు.

సన్నివేశ వ్యంగ్యము; ఒక సన్నివేశంలోని యధార్ధవిషయము ప్రేక్షకులకు ముందుగానేతెలిసి ఉంటుంది. కాని పాత్రలు దానిని వేరొక విధంగా బావిస్తారు. ఈ రేంటి విపర్యయం మూలంగా అలౌకికానందము ప్రేక్షకునికి కలుగుతుంది.

షేక్స్ పియర్ రచించిన ఐదవ హెన్రీరూపకము దీనికి చక్కని ఉదాహరణ. రాజుకు వ్యతిరేకంగా కుట్రజ్రుగుతున్నదని ప్రేక్షకులకు ముందేతెలుసు; రాజుకూ తెలుసు. కుట్రదారులకు మాత్రము తమ కుట్రసంగతి మరెవ్వరికీ తెలియదని నమ్మకము. రాజు వారి కుట్రను వారిచే ఒప్పిస్తూఉంటే ప్రేక్షకులలో ఒక విధమైన ఆనందము కలుగుతుంది.

చంద్రహాసరూపకంలో మంత్రి దుష్టబుద్ధి చంద్రహాసుని చంపడానికి విషసర్పాలను ప్రయోగింపజేస్తాడు. ఈ పాముకాటువల్ల చంద్రహాసుడు మరణించినాడని నమ్ముతారు. చంద్రహాసుని శవాన్ని కళ్లారాచూసి ఆనందించవలెనని తీరా వచ్చి చూసేసరికి అచట కనిపించింది తన కుమారుడైన మదనుని శవము! కాళికాలయంలో పూజ చేయడానికి చంద్రహాసునికిబదులు మదనుడు రావడం. పాములు అతనిని కరవడం మూలంగా అతడు మరణించడం ప్రేక్షకులు రంగ