పుట:RangastalaSastramu.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాదృశ్యము

ఇంక పాత్రసాదృశ్యము రెండు రకాలు: 1.ఆహ్లాద సాదృశ్యము, 2. శీల సాదృశ్యము.

ఆహ్లాదసాదృశ్యానికి మంచి ఉదాహరణ షేక్స్ పియర్ రచించిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ (Comedy of Errors). ఈ రూపమంలో ఇద్దరు కవలలు ఒకే ఆకారాము కలిగిఉంటారు. ఆకారంలోని ఈ సాదృశ్యము పెక్కు చిక్కులకు దారి తీస్తుంది. భాసుని 'ప్రతిమా ' నాటకంలో రాముడు, భరతుడు ఒకటే రూపు. సీతకూడా భరతుని చూసి రాముడని భ్రమపడుతుంది. సీత మొదటిసారిగా భరతుని చూసి "అహో ఆర్యపుత్రులు పర్ణశాల విడిచి ఇటువచ్చిరా కాదు, కాదు, ఇది రూప సాదృశ్యము"1 అని అనుకొంటుంది.

ఇక, శీలసాదృశ్యానికి ఉదాహరణ: "చింతామణి" నాటకంలో బిల్వమంగళుడు, భవానీశంకరుడు, సుబ్బిశెట్తి ఈ ముగ్గురూ వేశ్యాలోలురే ! వేశ్యాలోలురై ముగ్గురూ తమ ఆస్తులను పోగొట్టుకొన్నవారే ! ఆఖరి అంకంలో వేశ్యాస్సంపర్కంమూలంగా వచ్చే అనర్ధాలను ముగ్గురూ ఏకవిధంగా చాటడంవల్ల కధావస్తువుకు మంచిబలము చేకూరింది.

భవానీ శంకరుడు---

చచ్చి బ్రతికినవాడను, సానికొంప
జొచ్చి మిగిలినవాడును మచ్చుకేని
వసుధ నెందునులేడు దైవంబుతోడు2.

సుబ్బిశెట్టి కూడా అదే భావాన్ని చెబుతాడు--

ఎల్లబోకుడాళ్ళ ఇళ్ళకెన్నడు మన
కచ్చిరారు సానులమ్మ తోడు 3

బిల్వమంగళుడు కూడ అంతే--

పాపకృత్యములచే బహు వికృష్టంబగు
వ్యభిసారము వినాశమందుగాక ! 4


1.---చిలకమర్తివారి ప్రతిమా నాటకము (అను), పుట 40.

2.---కాళ్ళకూరి నారాయణరావుగారి, "చింతామణి", దశమాంకము, పుట-100

3.---ఆదేనాటకంలో పుట-101

4.---అదేనాటకంలో పుట-102