రామదాసు నాటకము.
నాల్గవకూర్పు పీఠిక.
(మొదటికూర్పులోని భాగము.)
“నేను హైద్రాబాదు నగరమున చిరకాలము వసించి, భద్రాచల రామదాసు చరిత్రను విమర్శించియున్నాఁడను. ఈ నాటకముయొక్క కథాభాగము చరిత్ర ననుసరించియున్నది. రెండువందల సంవత్సరములు క్రిందట గోలకొండ రాజ్యపాలకుఁ డగు తానీషాకాలమున నక్కన్నయను నియోగి బ్రాహణుఁడు రాజమంత్రియై యుండెను. అతనికి గోపన్న మేన లుఁడు. ఇతఁడే రామదాసు. ఇతఁడు కబీరుదాసువలన రామమంత్రో పదేశముఁబడసి సతతము రామసేవాతత్పరుఁడై తన సర్వస్వము దానముఁ జేసి భద్రాచలమునకు నడ తెంచి యందు దైవాజ్ఞగ తహశీల్ దారుద్యో గమున ప్రవేశించి తానీషాయొక్క యాదార్యధర గుణంబులు నమ్మి ప్రజల పన్ను పైకము వ్యయపఱచి శ్రీరాములకు దేవాలయము రమ ణీయముగ నిర్ణయించెను. కొందరు మహమ్మదీయు లసూయచే పగఁ బూని, తానీషాను మోసపఱిచి, రామదాసును చెఱ పట్టించిరి. శరణా గతరక్షకుఁడును భక్త పాలకుఁడు నగు పరమాత్రుఁడు రామదాసును గాపాడి తానీషారామదాసులకు ముక్తి యొసఁగెను. తానీషా భద్రా చలమును శ్రీరామునకు జాగీరుగ సమర్పించెను. ఈ దినమువఱకు భద్రాచల మమితమహిమతోడ వెలుఁగుచున్నది. ఇప్పటికిని గోలకొండ లో రామదాసునుంచిన చెఱసాల చూపట్టుచున్నది.. ఈకథను పొద వెట్టు నాటకంబున ప్రేక్షకుల యుల్లములకు నెలమిగలిగించు రంగములు కొన్ని సందానితములై యున్నవి. పౌరులు మొదలగు సామాన్య పాత్రల కా 'కాలమునుండి యిదివఱకు నుపయోగింపఁడు మిశ్రభాష వ్రాసి యున్నాఁడను. కబీరు మొదలగు తురక వేషధారులకు కొన్ని చోట్ల నచ్చ మగు నుర్దుభాషయును ప్రక్కననే తెనుగును వ్రాసియున్నాఁడను; వేషధారుల శక్తికొలఁది, దర్శకుల రక్తికొలఁది నీమాటలు వాడవచ్చును.”. 3