పుట:Raajasthaana-Kathaavali.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రాజస్థానకధావళీ.

ప్రభలుగల దివ్యపురుషులు మణిమయం బగు స్వణ౯ విమానంబునఁ గూర్చుండఁ బెట్టికొని పోవ నంతరాళంబున మహావాయుపధంబునం దిరుగుచు సిద్ధుఁడు పుడమి పై కడుదవ్వుల నున్న బప్పనిం, జూచి పైకి వచ్చి నాయాశీర్వచనముల నందుకొమ్మని కేక వేసెను. ఆపరమ మునీంద్రు వాక్సుద్ధివలన బప్పఁడు చూచు చుండఁగ నే యిరువది మూళ్ళ పొడు గెదిగె నఁట. అప్పుడు ముని వానిం బిలిచి నోరు తెరువుమని యానతిచ్చి బప్పఁ డట్లు చేయ తుఋక్కున మొగముపై నుమిసెను. రాజకుమారున కది కడు నసహ్యముగఁ దోఁచుటం జేసి యతఁడు సిద్ధు నియుమ్మి తననోటఁ బడకుండ నించుక యావలకుం దప్పుకొన, నది వాని కాలిపైఁ బడియె, సిద్ధు డది గనుంగోని, నీవు నే జెప్పిన చోప్పునఁ జేసితి వేని చిరంజీవివై యుందువుగద! కాని మ్మిప్పుడైన నీ కేయాయుధమువలనను భయము గలుగ దని పలికి యంతధా౯న మయ్యెను. అనంతర మాబప్పఁ డింటికరిగి జరిగిన వృత్తాంత మంతయుఁ దల్లి కెఱింగింప నామెయు, నతిలోకంబగు నయ్యద్భుతంబున కానంద పరవశయై 'నాయనా! నీ వందఱనుకొన్నట్లు పశులకాపరివి కావు; సకల మహీభరణ దక్షుండవగు రాజపుత్రుండవు; నేను రాజకన్య' నని గుట్టు వెల్లడి చేసి పూర్వవృత్తాంత మెఱిఁగించెను. బప్పఁడది విని నాఁడు మొద లావుల మండలఁ గాఁచుట మాని రాచరికము సంపాదింప దేశముల వెంట, దిరుగ నారంభించెను.ఆసమయమున బప్పఁడు నా గేంద్రగామమును విడుచుటయు నాతనికి మిక్కిలి క్షేమకరము, ఏలనన నాతని విషయమై దుర్భరమగు నొక చెడు వాడుక వ్యాపించుటం జేసి, యూరెల్ల నట్టుడికిన ట్టుడుక సాగెను. గ్రామనాయకుని కూఁతురు సంప్రాప్త యౌవనయై వివాహయోగ్యయగుటం జేసి దానికిం దగు వరుఁ డొకఁడు లభించెను. వివాహ ప్రయత్నము లన్నియు జరిగి సిద్ధముగనుండ ముహూర్తము నిశ్చయించుటకు వచ్చిన బ్రాహ్మణుఁడు బాలిక జాతకమును జూచి గ్రహసంచార