పుట:Pratha Nibandhana Kathalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోషే శక్తి సన్నగిల్లనూ ඒඨ, దృష్టి మందగించనూ లేదు. ప్రభువే అతన్ని మోవాబు లోయలో పాతిపెట్టాడు. కాని అతని సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. నేటివరకు యిప్రాయేలీయుల్లో మోషేలాంటి ప్రవక్త మళ్లా పట్టలేదు. అతడు దేవునితో ముఖాముఖి సంభాషించిన మహాభక్తుడు. అతని జీవితాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. తొలి నలభైయేండ్లు ఈజిప్టులో రాజకుమారుడుగా తర్ఫీదు పొందాడు. అటుతర్వాత నలభైయేండ్లు ఎడారిలో గొర్రెల కాపరిగా జీవించాడు. చివరి నలభై యేండ్లు యిస్రాయేలు ప్రజలకు నాయకుడుగా మెలిగాడు. 35. యెరికో పట్టణాన్ని జయించడం - యోషు 6 యిస్రాయేలు ప్రజలు యోషువా నాయకత్వాన కనాను దేశానికి వచ్చారు. కాని ఆ దేశంలో ప్రవేశించాలంటే మొదట యెరికో పట్టణాన్ని జయించాలి. అది ప్రపంచంలోని పురాతన నగరాల్లో వొకటి. దానికి బలమైన ప్రాకారం వుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం ఏడరు యాజకులు బూరలనూడుతూ నగరం చుటూ తిరిగివచ్చారు. వారి వెనుక దైవమందసం వుంది. ముందు వెనుకల సైనికులు వున్నారు. ఈ విధంగా ఆరురోజులు నగరం ಮಿಟ್ಟ! ప్రదక్షిణలు చేశారు. ఏడవరోజు అదే ప్రదక్షిణం ఏడుసార్లు చేశారు. యాజకులు బూరలు ఊదుతూండగా సైనికులు యుద్ధనాదం చేశారు. ఆ శబ్దానికి కోటగోడలు వాడంతట అవే విరిగిపడ్డాయి. యిస్రాయేలు సైన్యం నగరంలో జొరబడి దాన్ని నాశం జేశారు. ఈ కార్యమంతా యావే నిర్ణయించినట్లుగానే జరిగింది. 36. ఆకానుకి శిక్ష - యోషు 7 యిస్రాయేలు ప్రజలు శత్రు నగరాలను ముట్టడించినపుడు అచటి నరులను, జంతువులను, వస్తువులను నాశం చేయాలి. వేటిని దక్కించుకో గూడదు. ఇది ప్రభువు ఆజ్ఞ. వారి సైనికులు కనాను దేశంలోని హాయి పట్టణాన్ని ముట్టడించారు కాని జయించలేకపోయారు. కారణమేమిటా అని విచారించగా ఆకాను అనే సైనికుడు దోషి అని తేలింది. అతడు నగరంలోని దోపిడి వస్తువుల్లో వెండిబంగారాలు పట్టుబట్టలు దక్కించుకొని వాటిని తన