పుట:Prasarapramukulu022372mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

83

నాటక విభాగం నుండి పాల్గొంటున్నారు. నాటక రచయితగా, నటులుగా వారు ఆకాశవాణి ప్రసారాలకు దోహదం చేస్తున్నారు.

గొల్లపూడి మారుతీరావు ఈ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆలానే M. S. శ్రీరాం దూరదర్శన్ మదరాసు కేంద్రంలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా వ్యవహరించారు. శ్రీ టి. వి. రాఘవాచార్యులు తమిళనాడులో అనేక కేంద్రాలలో పనిచేశారు. నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 1938 డిసెంబరు 24న జన్మించిన రాఘవాచార్యులు 1963 జనవరిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. వివిధ కేంద్రాలలో పనిచేసి (తిరుచి, మదరాసు) అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా, డిప్యూటీ డైరక్టరుగా దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ఆరు సంవత్సరాలు (1987-95) మధ్య పని చేశారు. 95 నుండి బోపాల్ దూరదర్శన్‌లో డిప్యూటీ డైరక్టరుగా పనిచేస్తున్నారు. రాఘవచారి రచయిత. కాంచీపుర క్షేత్రాలను గూర్చి ఒక గ్రంథం వ్రాశారు. ఆధ్యాత్మిక భావసంపత్తి గల రాఘవచారి కంచి కామకోటి పీఠానికి బాగా సన్నిహితులు.

కుమారి S. లీల 1939 నవంబర్ 22న జన్మించారు. M. G. రామచంద్రన్ సరసన సినిమాలలో నటించారు. 1963లో మదరాసులో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి 1981లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయ్యారు. 1989లో స్టేషన్ డైరక్టర్ గా పదోన్నతి పొంది కొద్దిరోజులు డైరక్టరేట్‌లో పనిచేసి ఆ తర్వాత మధురై కేంద్రం డైరక్టర్‌గా చేరారు.

డా. డి. ఆంజనేయులు :

ఆకాశవాణి వార్తా విభాగంలో పని చేసిన ఎందరో ఆంధ్ర ప్రముఖులు జర్నలిష్టులుగా పేరు తెచ్చుకొన్నారు. ధూళిపూడి ఆంజనేయులు గుంటూరు జిల్లా ఎలపర్రులో 1924 జనవరి 10న జన్మించారు. మదరాసు క్రిష్టియన్ కళాశాలలో ఎం.ఏ. పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత లా పట్టా పుచ్చుకున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో 1948 నుండి 1953 వరకు పనిచేసి 1953 - 1958 మధ్యకాలంలో హిందూ పత్రికలో పనిచేశారు.

వాణి పత్రిక సంపాదక బాధ్యతలను 1959లో మదరాసులో చేపట్టడంతో ఆయన ఆకాశవాణి సంబంధం ప్రారంభమైంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైద