పుట:Prasarapramukulu022372mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడాయిక్కడా కూడా ప్రధమశ్రేణి కవులు, సాహిత్య పరులు సర్వశ్రీ కృష్ణశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, కందుకూరి రామభద్రరావు, బందా కనకలింగేశ్వరరావు, తర్వాత హైదరాబాద్‌లో స్థానం నరసింహారావు, మునిమాణిక్యం, నాయని సుబ్బారావు, గోపీచంద్ సన్నిహితులుగా వుండేవారు.

ఇక ఈ పుస్తకం విషయాని కొద్దాం.

ప్రసార ప్రముఖులను గూర్చి తలపెట్టిన ఈ రచన మా మిత్రులు డా. ఆర్. అనంత పద్మనాభరావు మదరాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు మాత్రమే గాక తదితర కేంద్రాలు, ఢిల్లీలోని వార్తా విభాగము, డైరక్టర్ జనరల్ కార్యాలయము, మిగిలిన కేంద్రాల ప్రముఖుల విశేషాలను అన్నిటినీ కొంత పరిశోధించి శ్రమపడి సేకరించి తయారుచేసిన ప్రణాళిక నాకెంతో మెచ్చుకోదగిందిగా కనిపిస్తోంది. లబ్ధ ప్రతిష్టు లెందరో చేరారిందులో. ఇప్పుడు సూచించిన కేంద్రాలలోను ఆయా విభాగాలలోను పనిచేసిన స్వానుభవపూర్వకమైన గ్రంథ రచయిత విషయానికి చక్కగా న్యాయం చేకూర్చారని మన:పూర్వకంగా అభినందిస్తున్నాను.

డా. బాలాంత్రపు రజనీకాంతరావు.

మాజీ స్టేషన్ డైరక్టర్