పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచయిత

జననం 1889. కాశ్మీర బ్రాహ్మణులు, తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రఖ్యాత న్యాయవాది. తల్లి స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ - అలహాబాద్. ఇంటివద్ద కొంతకాలం ప్రైవేటు చదువుకొని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్య నభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1913లో ఇండియన్ హోమ్‌రూల్ లీగుకు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిలభారత కాంగ్రెస్ సభలో సభ్యుడుగానున్నారు. 1921 లో మొదటిసారి కారాగృహ వాసా న్ననుభవించారు. ఇప్పటికి ఎనిమిది మారులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూచివచ్చాడు. 1929 లో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు. 1930 లోను, 1936, 37, 46 లలోనూ కాంగ్రెస్ అధ్యక్షులయినారు. వివాహితులు. భార్య - కమలా నెహ్రూ చనిపోయింది. కొడుకులు లేరు. ఒక్కతే కుమార్తె ఇందిరా గాంధీ. చెల్లెండ్రిద్దరు -విజయలక్ష్మి పండిట్, కృష్ణ హశీసింగ్ .

ఈయన గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు. వీరి రచనలలో ' సోవియట్ రష్యా' 'ప్రపంచ పరిణామము'లను మాప్రచురణలలో ప్రచురించియున్నాము. నేడు (1950) ఇండియా ప్రధానిగా నున్నారు.

విలాసము: 17.యార్క్ రోడు. న్యూ డిల్లీ