పుట:Pranayamamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును కలిగియున్నవి. వీటిని యీ కండ్లతో చూడజాలము. వాటిని దివ్య (యోగ) దృష్టిచే మాత్రమే చూడగలము. వీటిలో ఆరు ప్రధానచక్రములు. 1. మూలాధారము, గుదము వద్ద 4 దళములు గలిగి యుండుట. 2. స్వాధిష్ఠాన (6దళములు) ము. జననేంద్రియమువద్ద వుండును. 3. మణిపూరము(10 దళములు)బొడ్డువద్ద. 4. అనాహతము (12దళములు) హృదయమువద్ద. 5. విశుద్ధము (16 దళములు) గొంతువద్ద. 6. ఆజ్ఞాచక్రము(2 దళములు) రెండు కనుబొమల మధ్య వుండును. ఏడవచక్రము తలపైగల వెయ్యిదళములుగల సహస్రారము. త్రికాస్థిప్రదేశము(SACRAL PLEXUS) ను మూలధారమనియు, శుక్రాశయ ప్రదేశమును (PROSTATIC PLEXUS) స్వాధిష్ఠానమనియు, సౌరప్రదేశమును (SOLAR PLEXUS) మణిపూర చక్రమనియు, హృదయప్రదేశమును (CARDIAC PLEXUS) ఆనాహతచక్రమనియు, గొంతుప్రదేశమును (LARYNGEA PLEXUS) విశుద్ధచక్రమనియు, (CAVERNOUS PLEXUS) ను ఆజ్ఞాఅచక్రమనియు పిలువవచ్చును.

నాడులు

నాడులు ప్రాణ ప్రవాహములను గొంపోవు, సూక్ష్మపదార్థములచే చేయబడిన సూక్ష్మ నాళములు. వీటిని దివ్య దృష్టితో మాత్రమే చూడ గలము. ఇవి మజ్జాతంతులు కావు. ఇవి 72 వేలు. వీనిలో ఇడ, పింగళ, సుషుమ్నలు ముఖ్యమైనవి. వీటి మూటిలో సుషుమ్న ముఖ్యమైనది.

నాడీశుద్ధి

ప్రాణాయామము - ఆన, ప్రాణము - అపానములు రెండూ కలియుట అని చెప్పియుంటిమి. ఇది మూడు విధములు.