పుట:Prabodhanandam Natikalu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నారు. అందువలన మీ మూడుమతముల వారికి దేవుడు ఏమాత్రము అర్థము కాలేదు. కానీ దేవుడు మీ అందరికి ఒక అవకాశమిచ్చాడు. అన్ని మతములకు అతీతముగా, ముగ్గురు ప్రవక్తలు చెప్పిన వాక్యములకు సరియైన అర్థము తెలుపు వ్యక్తి ప్రస్తుతము భూమిమీద ఒకే ఒకడున్నాడు. అతనిని ఆశ్రయించినా, అతని బోధలను ఆశ్రయించినా, మీ ప్రవక్తలు చెప్పిన రహస్యములు మీకు వివరముగా అర్థము కాగలవు. ఆయన ఎవరో నాకు తెలిసినా నేను దొంగను కదా! అందువలన నేను చెప్పను. మీరే వెతుక్కొని సత్యమును తెలుసుకొని సరియైన దైవమార్గములో నడవండి.

సమాప్తము
(ఈ నాటికలో ఏ మతస్థునికైనా అర్థము కాని విషయముంటే
సామరస్యముగా అడిగి తెలుసుకోవచ్చును.)

-***-


అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.