పుట:Prabodhanandam Natikalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంటను అపుకోలేక, ఏదో ఒకటి ఇవ్వమని అడిగితే కసురుకొని పొమ్మంటారా? పుట్టినప్పటి నుండి నెయ్యిని చూడనివారు, నెయ్యి రుచి ఎట్లుంటుందో తెలియనివారు, ఈ దేశములో చాలామంది కలరు. డబ్బాలు డబ్బాలు నెయ్యి అగ్నిలో పోసే బదులు, ఒకకేజీ నెయ్యి ఇటువంటి బీదవానికి ఇస్తే, ఇచ్చినందుకు మీకు పుణ్యము, తీసుకొన్నందుకు అతనికి సంతోషమైనా ఉంటుంది. ఇటు పుణ్యానికిగానీ, అటు పురుషార్థమునకుగానీ సంబంధము లేని పనిని మీరు చేస్తున్నారు.
1) పిల్లవాడు ఏడుస్తుంటే అన్నము పెట్టలేని ఆర్థిక ఇబ్బందులలో ఎందరో ఉండగా, భక్తి అను పేరుతో దేవతల మెడలో బంగారం, దేవతల గుడులలో బంగారం నింపడము సాటిమనిషి చేయదగిన పనేనా? 2) ఎదుటివాడు అడుగుచున్నా పిడికెడు అన్నము పెట్టకుండా, అడగని మూగదేవతలకు, తినని మొండిరాళ్ళకు రుచులతో కూడిన నైవేద్యములు పెట్టడము మంచిదా? 3) మీరు చేసే యజ్ఞములలో వృథాగా కాల్చు గుడ్డలు, బంగారు, నెయ్యి, ధాన్యములను ఇతరుల ఆహారమునకు ఉపయోగిస్తే ఎంతమంచి పని అగునో కొంతయినా యోచించారా?

1) బిడ్డ పెళ్ళికి అరతులము బంగారంకొనలేని తండ్రులు ఎందరో ఉండగా, కొన్ని కేజీల బంగారం మోయుచున్న ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.

2) చంటిబిడ్డకు పాలులేక డబ్బులు పెట్టి కొనితెచ్చి తాపలేక, బాధపడు తల్లులు ఎందరో ఉండగా, వందలలీటర్ల పాలు నెత్తిన పోయించుకొను ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.

3) కట్టుకొనుటకు ముతకగుడ్డలు కూడ లేక, చలికి బాధపడు బీద వారుంటే వెచ్చనిగుళ్ళళ్ళో పట్టువస్త్రములు కట్టిన ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.