పుట:Prabodha Tarangalul.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రద్ధ నీ ఇష్టప్రకారమే ఉండును. అనగా జ్ఞానములో నీవు స్వతంత్రునివన్న మాట. అజ్ఞానములో ఎప్పటికి అస్వతంత్రునివేనని తెలుసుకో.

736. జీవితము సుఖ దుఃఖ సంగమము. అయినా మనిషి సుఖాలనే కోరుకుంటాడు. దుఃఖాలనువద్దనుకుంటాడు. కానీ అవేవీ నీ ఇష్టప్రకారము రావు, పోవు.

737. ఎంత జ్ఞానము వినినా మనిషి అజ్ఞానము వైపే మాట్లాడుతాడు. మనిషి ఎంత అజ్ఞానము వైపు మాట్లాడినా గురువు ఓర్పుగా మనిషిని జ్ఞానమువైపు పోవునట్లే చేయవలెనని ప్రయత్నించుచుండును.

738. అహము అద్దములాంటిది, మనస్సు సినిమాలాంటిది. మనస్సు ఎప్పుడు చూపినా బయటి విషయములనే చూపుచుండును. అహము ఎప్పుడు చూపినా నిన్ను నీకే చూపుచుండును. అహములో నీవు తప్ప ఎవరు కనిపించరు. మనస్సులో అన్ని రకముల విషయములు కనిపిస్తుండును.

739. స్త్రీలింగము, పుంలింగము అని అంటున్నాము. ఈ రెండు పదములలో లింగము అనునది సాధారణముగ ఉన్నది. దీనినిబట్టి స్త్రీలలోనైనా, పురుషులలోనైనా పరమాత్మ (లింగము) సాధారణముగా ఉన్నదని తెలియుచున్నది.

740. ఏనుగు ఎంత పెద్దదైనా శిక్షకుని మాటను బుద్ధిగా వింటున్నది. మనిషి ఎంత చిన్నవాడైనా గురువుమాటను బుద్ధిగా వినకున్నాడు.

741. అహము అద్దములాంటిదే, ఎదురుగున్న వాని దృశ్యమును వానికే