పుట:Prabhutvamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

99

సామాన్యప్రకృతులమాట చెప్పనేల ? ఒక్కరితో నొక్కరు వివాదములుపడుట మానవులకు సహజము. లోకము నాగరకవంతమయినట్లెల్ల ఈవివాదధోరణి హెచ్చగుటయు ప్రస్తుతయుగమున కానవచ్చుచున్నది.

విభేదముల తీర్మానము

సంఘములోని ప్రజలందరును ఒక్కచోట గుమిగూడి ఆలోచించుకొని సమ్మతినిచ్చినను ఈయకున్నను మొత్తముమీద వారియందర మౌనాంగీకారము కలదగుటచేతనే ప్రభుత్వము అనునట్టి ప్రకృతి లోకమున ప్రత్యేకముగా నేర్పడుచున్నది. ఏర్పడినపిదప ప్రభుత్వమను పదార్థమొక్కటియు ప్రజయను పదార్థమొక్కటియునై ఈరెంటికిని విభేదములు కలుగుచున్నవి. ప్రభుత్వమునందును ప్రత్యేకవ్యక్తు లుందురు, ప్రజయందును ప్రత్యేక వ్యక్తులుందురు. ప్రభుత్వము నందుండు ఒక్కొక్క ప్రత్యేకవ్యక్తియు ప్రభుత్వముకాదు. ఆత డధికారియాత్రమగును. ప్రజయందలి యొక్కొక్క వ్యక్తియు ప్రజకాదు. అతడు పౌరుడు మాత్రమగును. కాబట్టి నేటి సంఘజీవితమునందు అయిదువిధములైన విభేద కారణములు కలవు. 1 మానవునకు మానవునకు గలుగునట్టివి, 2 సంఘమునకు ప్రభుత్వమునకు కలుగునట్టివి, 3 పౌరునకు ప్రభుత్వమునకు కలుగునట్టివి, 4 పౌరునకు అధికారికి కలుగునట్టివి, 5 అధికారికి అధికారికి కలుగునట్టివి.

వీనిలో సంఘమునకును ప్రభుత్వమునకును కలుగునట్టి విభేదములను ప్రజాపరిపాలితదేశముల యందు ఎన్నికలలో ప్రజూనుకూలముగ ప్రభుత్వమును మార్చుకొనుట