పుట:Paul History Book cropped.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(మనవిమాట)

సువిశేషకారులకంటె ముందుగా క్రీస్తుని గూర్చి సమగ్రంగా వ్రాసినవాడు పౌలు భక్తుడు. నేడు మనం నమ్మే వేదసత్యాలూ క్రైస్తవ ఆచరణవద్ధతులూ చాలవరకు మొదటలో అమలు వరచినవాడు అతడే.

పౌలు క్రీనుని గాఢంగా అనుభవానికి తెచ్చుకొన్న మహాభక్తుడు. క్రీనువట్ల వ్యక్తిగతమైన అనుభవాన్నీ భక్తినీ పెంపొందించుకోగోరేవాళ్లకు అతడు నేటికీ మార్గదర్శకుడుగా వుంటాడు.

క్రైస్తవ జీవితమంటే ప్రధానంగా క్రీస్తుని జీవించడమే. పౌలు సందేశం కూడ యిదే. కనుక అతని బోధలు విశ్వాసులందరికీ శిరోధార్యాలు కావాలి.

ఐనా మన క్యాతలిక్ సమాజంలోని విశ్వాసులకు పౌలు జాబులను గూర్చిగాని, అతని భావాలను గూర్చిగాని అట్టే తెలియదు. మన సమాజం ఇంతవరకు ఆ భక్తుని మినాద ఒక్క పుస్తకాన్ని కూడ ప్రచురించలేదు. ఇది పెద్దలోటు. ఈ గ్రంథంలో పౌలు సందేశాన్నీ, అతని మౌలిక భావాలనూ క్లుప్తంగా తెలియజేసాం. ఇది పౌలు లేఖల్లో దేనిమివాదకూడ వ్యాఖ్య కాదు. అతని ముఖ్యబోధలను సంగ్రహంగా తెలియజేసే పుస్తకం. పౌలు జాబులకు పరిచయప్రాయంగా వుంటుందన్న భావంతో దీని తయారుచేసాం. ఒక్కో లేఖవిూద వివరణం ఇకమిూదట రావాలి.

పాఠకులు మా పూర్వగ్రంథాలవలె దీన్ని కూడ ఆదర భావంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాం.

ఈ గ్రంథముద్రణకు ఆర్థిక సహాయాన్ని అందించిన బి. సాంసన్ ఫాదరుగారిని ప్రభువు దీవించునుగాక. -గ్రంథకర్త