పుట:Paul History Book cropped.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీ.శ. 36. డమస్కు త్రోవలో ఉత్థానక్రీస్తు గొప్ప వెలుగురూపంలో పౌలుకి దర్శనమిచ్చాడు. మిరుమిటుగొల్పే ఆ వెలురు తండ్రి తేజస్సే. అనగా తండ్రి సాన్నిధ్యం. తండ్రే క్రీస్తుని పౌలుకి ప్రత్యక్ష్యం జేసాడు-అచ 9,1-19. ఈ దర్శనం పౌలు జీవితాన్ని పూర్తిగా మార్చి వేసింది. మామూలుగా ఈ దర్శనాన్ని సౌలు "పరివర్తనం" అని పిలుస్తారు. కాని యుథార్థంగా అతనికి యిక్కడ కలిగింది "పరివర్తనం" కాదు, మార్పు మాత్రమే. అతడు మనలాగ పాపియైయుండి పరివర్తనం చెందలేదు. పౌలు, యూదమతాన్ని ధర్మశాస్ర నియమాలనూ నిష్టతో పాటించినవాడు. యూదుల భావాల ప్రకారం పుణ్యాత్ముడు, పవిత్రుడు-గల 1, 14. ఈ దర్శనం వల్ల పౌలు యూదమతం నుండి క్రైస్తవమతంలోకి వచ్చాడు. క్రీస్తుకి ప్రత్యర్ధియైనవాడు అతనికి సేవకుడు అయ్యాడు. అతనిలో కలిగిన మార్పు ఇదే.

పూర్వం పౌలు క్రైస్తవులను ఫనోరంగా హింసించాడు -అచ8,3. కాని అతడు క్రైస్తవులను ఎందుకు హింసించాడో అర్థంజేసికోవాలి.

1. క్రైస్తవులు యేసు మెస్సియా అని వాదిస్తున్నారు-అచ 2,36. కాని ధర్మశాస్రం సిలువపై చనిపోయినవాడు శాపగ్రస్తుడు అని చెప్పంది-ద్వితీ 21,22-23. శాపగ్రస్తుడైన యేసు మెస్సియా ఏలాగౌతాడు? కను యేసుని మెస్సియాగా ప్రకటించేవారిని పట్టి రూపుమాపాలి.

2. క్రైస్తవులు క్రీస్తుని "ప్రభువు" అంటున్నారు. ఈ పదం పూర్వవేదంలో యూవే ప్రభువుకి బిరుదం. యేసు ప్రభువైతే యూవేకు సరిసమానుడు, దేవుడు. యూదులకు దేవుడు ఒక్కడే. ఈ రెండవ దేవుణ్ణి ప్రచారం జేసే క్రైస్తవులు దేవదూషకులు. కనుక వారి శాఖను మొగ్గలోనే త్రుంచివేయాలి.