పుట:Paul History Book cropped.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవది పౌలు డమస్కు త్రోవలో స్వయంగా క్రీస్తుని దర్శించాడు. ఇంకా వేరే దర్శనాలు కూడ పొందాడు. ఈ దర్శనాల్లో ఉత్థాన క్రీస్తు అతనికి నేరుగా వేదసత్యాలను తెలియజేసాడు. ఈయంశాలుకూడ అతని రచనలకు ఆధారమయ్యాయి. పాలు ప్రధానంగా దైవానుభూతిగల రచయిత.

3. పౌలు జాబులు

పూర్వం ప్రజలు పౌలు 13 జాబులు వ్రాసాడు అనుకొన్నారు. కాని యిప్పడు బైబులు పండితులు అతడు 7 జాబులు మాత్రమే వ్రాసాడు అని చెప్నన్నారు. ఆ జాబుల రచనా కాలాలు ఉజ్జాయింపుగా ఇవి.

1. తెస్సలోనీయులు - 52
గలతీయులు – 54
1కొరింతీయులు – 54
2కొరింతీయులు – 55
రోమినాయులు – 58
ఫిలిప్పీయులు – 61
ఫిలెమోను – 61

రెండు తెస్సలోనీయులు, కొలోస్సీయులు, ఎఫెసీయులు పౌలు శిష్యులు వ్రాసినవి. తీతు, రెండు తిమోతి జాబులు పౌలు అనుచరులు వ్రాసినవి. (హెబ్రేయుల జాబు ఎవరో పరోక్ష శిష్యుడు వ్రాసింది.) మనమటుకు మనం ఈ గ్రంథంలో పై 13 జాబుల నుండి భావాలను పరిశీలిస్తాం.

పౌలు రచనలు లేఖా రూపంలో వున్నాయి. ఈ జాబుల్లో కొన్ని అతడే స్వయంగా వ్రాసి వుండవచ్చు. కొన్ని అతడు నోటితో