పుట:Parama yaugi vilaasamu (1928).pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము.

511


నమరవర్గమునకు నమృతంబుఁ బెట్టు
కమలాక్షుగతి హస్తకమలంబుఁ [1]దొడికి
పరకాలునకు మున్ను భక్తి దైవాఱఁ
గరమున నొకపిడికడు ప్రసాదించి
కడమతద్భటులకుఁ గ్రమమేరుపడఁగఁ
పిడికెడు పిడికెడు పెట్టెఁ బెట్టుటయు
నలసుధారసపాను లైనదేవతల
తెలివి నందఱుఁ బరితృప్తులై రపుడు
పరకాలుఁ డలరి యా భక్తవత్సలుని
చరణపద్మములకుఁ జాగిలి మ్రొక్కి
యెయ్యది మీనామ మెందుండి యిటకు
నయ్య! వేంచేసితి రానతిం డనఁగ
ననిశంబు కాంచికి నపరభాగమున
నునికిగా నెలకొని యుండుదు నేను
ననుసాష్టభుజకర నరసింహుఁ డందు
రనుచు నంతర్హితుం డయ్యె నాకరణిఁ
గని పరకాలుఁ డక్కజ మంది యితఁడు
ననుఁ బ్రోవవచ్చిన నలినలోచనుఁడు
కాని వేఱొక్కఁడు గాఁ డంచుఁ బొగడి
యానందబాష్పాకులాక్షుఁడై [2]పొంగి


  1. దొడిగి
  2. పొగడి