పుట:Parama yaugi vilaasamu (1928).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

పరమయోగివిలాసము.


యని బిడ్డఁ గౌఁగిట నలమి పోనీక
మునుకొనిదుఃఖించు [1]ముదియ నీక్షించి
రావె దొంగలనంపి రాత్రి వేవేగ
దేవదేవునిసొమ్ము దెప్పించునపుడు
నవ్వను బిమ్మట నగరివా రెఱిఁగి
యివ్విధిం బట్టిన నేడ్వనా? ఱాఁగ!
కృపవుట్ట బిడ్డఁ గౌగిటఁ జేర్చి చేర్చి
యిపుడుసెప్పెడుబుద్దు లెటఁబోయె నప్పు
డని తిట్టి పొమ్మన్న నంతటఁ బోక
తనకూఁతువెనువెంటఁ దగిలి నాపోవ
నొక్కట వడిఁ [2]దలాయొకపెట్టుపెట్టి
కుక్కఁగొట్టినయట్లు కొట్టి చీకొట్టి
తలవరు లప్పు డంతటఁ బోకయున్న
దొలఁగంగ నిల వ్రాల ద్రొబ్బి నవ్వుచును
ఆకోమలాంగితో నామౌనివరుని
దోకొనిపోవుచోఁ ద్రోవ నున్నట్టి
చెలువలు మగలుఁ జర్చించి లోలోనె
తలపోసి పలికి రాదట వారిఁజూచి
తనవేఁడితేజ మంతయు డాఁచి పుడమిఁ
జనుదెంచుసూర్యునిసరణి నున్నాఁడు


  1. ముద్ది
  2. దలనొక