పుట:Parama yaugi vilaasamu (1928).pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

పరమయోగివిలాసము.


రతి[1] వేదశిక్షకు రతిరాజు తరటు
[2]గతి వేణి యొప్పు నక్కలకంఠకంఠి
వనములు[3] గాఢభావజకేలిఁ గొన్ని
దినము లచ్చోట వర్తించినమీఁద
నారామ తనకోర్కె యలరంగ విప్ర
నారాయణుని యోగినాయకోత్తముని
మునుపు విభాండక మునిపుత్త్రుఁ దోడి
కొనిపోయినట్లు తోకొని యేగుదెంచి
తనయగ్రజాతముందర నిల్ప ననుజఁ
గని మోహనాంగి దిగ్గన వెఱఁగంది
యవునౌనె నీ వాడినట్టి యీప్రతిన
యవగడం బగుమాట లవి నీకె చెల్లు
నోకొమ్మ! నీదుమా టొకటి సేఁ తొకటి
కాకుండ పంతంబుఁ గడతేర్చికొంటి
వాకొని వేయును వర్ణింప నేల
నీకు నీవే సరి నిఖలంబులోన
నీదెస మఱి నేర్పు లెన్న నేమిటికి
నీదెపో నేర్పైననేర్పు తన్వంగి!
యిలలోన నేము నీయిందఱలొన
మెలఁతరూపులఁ బొడమితి మింతెకాక


  1. వేగ
  2. గతి వేగ నొప్పు
  3. నీడ