Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనులేపనం చందన చర్బ చెమటను, దుర్గంధమును పోగొట్టి మనస్సుకు ఉల్లాసం పుట్టిస్తుంది. భ్రమను పొగొట్టి స్మృతిని కలిగిస్తుంది.

    శుభకార్యాలప్పుడు గంధాలు పూసుకుంటారు.  పేరంటపు వేళలలో స్త్రీలు మెడలకు, బుగ్గలకు గంధం పూసుకుంటారు.  గంధం పొడి చల్లుకుంటారు.  గంధం సమర్పించడం పూజించడానికి గుర్తు.
    శవాన్ని దహనం చేసేటప్పుడు మంటలో గంధపు చెక్క వేస్తారు.  గంధం కొంచెం కొబ్బరి నీళ్లలో కాని మంచినీళ్లలోకాని కలుపుకొని తాగితే దాహనం శాంతి కరంగా ఉంటుంది.
   ఆరోగ్యకాములు వేసవిలో ముఖ్యంగానూ, విరివిగానూ వాడ తగిన వస్తువు చందనమని  సింహాచలములోని చందనోత్సవం ఏటేల ఎలుగెత్తి చాటుతూ ఉంటుంది.

'చారుచర్య ' శ్రీ గంధ గుణమును ఇట్లు పేర్కొంటూ ఉంది.

   శ్రీ గంధం కృమితుష్టహారి విశదం తిత్తం కషాయాంవితం
   శీతం హృద్యంరోచకఘ్న మలిన ప్రద్వంసి విఅత్యాపమత్
   బల్యం వర్ణకరం విద్దహశమనం మోహాపహం ప్రీణనం
   మూర్ఛాచర్ధి వాసర్ప కేషుచ హితం స్వర్గం పరం శ్రీకరం

   "శ్రీగంధము కృములను, కుష్ఠువ్యాధిని హరించును. వగరుతోకూడిన చేదుగల్ రుచి గలిగి యుండును.  శీతవీర్యము గలది.  హృదయమునకు మేలుజేయును.  ఆరోచకమును, శారీరమాలిన్యమును, పైత్యమును బోగొట్టును. బలమును చేకూర్చును.  మంచి వర్ణము కలిగించును.  శరీరతాపము, మోహము, మూర్చ, వాంతులు విసర్ప వ్యాధిని బోగొట్తును. లక్ష్మీ ప్రదమైనది. శుభములు చేకూర్చును."   -వేటూరి శంకరశాస్త్రి
  బదరిలో అక్షతృతీయాపర్వం జరిగే తీరు శ్రీ సిష్టావేంకటసుబ్బయ్య గారు 'నాబదరీ యాత్ర ' అను గ్రంధంలో ఇట్లా వివరిస్తున్నారు.
        "ఋషికేశము నుండి హిమత్పర్వతాల మీద నూటముప్పయి ఐదు మైళ్లవరకు చమూలీదాక బస్సు నడుస్తుంది.  ఆ పైకి నడవ వలసిన భాగం బదరీదాకా సూమారు యాభైమైళ్లు