ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఇతర తావుల్లో జీవుల్ని, నదుల్ని, నగరాల్ని చంపడానికి వాడిన తన నాగలిని బలరాముడు ఈ తావున జీవుల్ని పెంచడానికి పనికి వచ్చే ఒక నది ఉత్పత్తికి ఉపయోగించాడు. కళింగము కింతటి మహోపకారము చేసిన బలరాముడు దానికి సమ్మెపస్థమైన ఉత్కళింగమునకు చెందిన పూరీ పట్టణము నందలి జగన్నాధస్వామివారి ఆలయమున స్వామి వారితో సమముగ పూజలందుకున్నాడు. కళింగమునకు బలరాముడు ప్రసాదించిన నది లాంగ్ల్య ఇప్పుడు తెలుగు వారికి మహోపకారికమై ఉన్నది.
బలరామ క్షేత్రమహాత్మ్యమను స్థానిక పురాణమున బలరామునికి ఈ ప్రాంతాలతోగల సంబంధము విపులీకృతమై ఉన్నది. తెలుగు వారు దానిని తెలిస్ కోవడము అవసరము. అంతేకాక తెలుగు నాటికి మహోపకారము చేసిన అతని జయంతిని ఏటేట వైభవముగా జరుపుకోవడమున్నూ తెలుగు వారికి అవసరమే.
కూరపాదులు
తమక్ ఎక్కువగా ఉపయోగించే తాటి చెట్టును కేతనం మీద నిలుపుకొని, తమకు ప్రధాన సాధనమైన నాగలిని ఆయుధముగా కలిగి ఒక నదితో తమ్ము హర్షకులనుగా చేసిన బలరాముని జయంతి దినమైన ఈ అక్షయ తదియ ఆంధ్రకర్షకులకు వారి కార్యకలాపాల విషయంలలో ఒక ముఖ్యదివసంగా ఉంది.
ఆంధ్ర కర్షకులు తమపొలాల్లో, ఆంధ్రగృహస్థులు తమపెరళ్లలో ఈనాడు కూరపాదులు పెడతారు. అవి యధా కాలాన మొలకెత్తి భరేణి, కృత్తికార్తులలో ఎందలు తట్టుకుంటూ నెమ్మదిగా ఎదిగి మృగశిగ కార్తెకు ముంగిళ్లు చల్లబడడంతోటే ఏపుగా ఎదిగి అప్పటినుంచి అక్షయంగా కాస్తాయి. ఈ విషయం పొట్లపాదుల సందర్భంలో బాగా దాఖలాగా ఉండడం తెలుగువరిలో చాలా మందికి తెలుసు.
చందన మహోత్సవము
తెలుగుదేశములోని గొప్పక్షేత్రాలలో ఒకటైన సింహాచలమునందలి శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈనాడు చందనొత్సవం జరుగుతుంది.
అక్షయ తృతీయనాడు సాధారణంగా కృత్తికా నక్షత్రం అవుతూ ఉంటుంది. గణిత్ర భేదము చేత ఒకప్పుడు రోహిణీ మృగశీర్షా నక్షత్రములలో