పుట:PandugaluParamardhalu.djvu/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమాదేర్ జ్యోతిషీలో ఉంది. ఇదిన్నీ అనుమానాస్పదంగానే ఉన్నది.

  చైత్ర బహుళ పంచమి మత్స్య జయంతి జరపాలని ఒకటి రెండు ప్రమాణగ్రంధాలు చెబుతూ ఉన్నాయి.  మనపంచాంగాల్లో బహుళంగా ఈనాడే మత్స్య జయంతి అని వ్రాసి ఉంటుంది.  మత్స్యావతారగాధ మచ్చుటైనది.
  ఆకాలంలో సోమకుడు అనే రాక్షసుడు ఒకడు ఉండెను.  వాడు బ్రహ్మనిద్రపోతూ ఉన్న సమయంచూచి బ్రహ్మముఖమందు ఉండే నాలుగు వేదాలను ఎత్తుకొని పోయి సముద్రంలో దాగుకొన్నాడు.  వేదాలతోడ్పాటులేక బ్రహ్మకు సృష్టికార్యం సవ్యంగా సాగలేదు.  ఆ విషయం అతడు విష్ణుమూర్తితో చెప్పుకొన్నాడు.  అప్పుడు మత్స్యమూర్తిగా ఉన్న జనార్ధనుదు నీటిలో వెదకి సోమకుని చంపేడు.  తన నాలుగు చేతులతో నాలుగు వేదాలు తెచ్చి బ్రహ్మకిచ్చాడు.
    వైవస్వత మనువు ఇతృతర్పణం చేస్తూ ఉన్నాడు.  అతని దోసిట్లో ఒక చిన్న చేప పడింది.  కరుణించి అతడు దానిని తన కమండలువులో వేశాడు.  అందులో అది ఒక పగలు, ఒకరాత్రి ఉండి పదహారు అంగుళాలు పెరిగింది.  తను ఉండడానికి ఆ కమండలువు చాలకుండా ఉందని గోలపెట్టింది.
     అప్పుడు మనువు దానిని ఎత్తి ఒక నీళ్ల కాలువలో ఉంచాడు.  అందులో అది ఒక రాత్రి ఉంది.  ఆరాత్రికి రాత్రి అది మూడు మూరల పొడవు పెరిగింది.  నాకిఈ చోటు చాలక చచ్చిపోతున్నాను. నన్ను రక్షించవలసింది అని ఆ చేప మొర పెట్టుకుంది.
     అప్పుడు మనువు దానిని ఒక నూతిలో వేశాడు.  అది ఆనుయ్యి కూడా సరిపోనంత పెద్దగా పెరిగింది.  అందుమీద మనువు దానిని ఒక చెఱువులో వదిలాడు.  అది ఆ చెఱువు పట్టనంతటి పెద్దచేపగా అయింది.  అంతట అతడు దానిని ఒక నదిలో వదిలాడు.  పెరుగుతూ వచ్చిన చేపకు ఆనదిసరిగా చాలింది కాదు.  ఆ పిమ్మట మనువు దానిని సముద్రంలో ఉంచాడు.  అది చేరడంతోటే సముద్రం అల్లకల్లోలమైంది.  ఆ అల్లకల్లోలంలో ఆమీను మేనురెండు లక్షల యోజనాల ప్రమాణంనికి పెరిగింది.  అంత బ్రహ్మాండంగా పెరిగికూడా అది నన్ను రక్షించు, నన్ను రక్షిందు అని మొరపెట్టటం మానలేదు.